విషాదం: నారాయణలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

కడప: నారాయణ కళాశాలలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కడపలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పావని(16) హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

బాకరాపేటకు చెందిన పావని గురువారం రాత్రి హాస్టల్‌లోని తన గదిలో ఈ దారుణానికి పాల్పడింది.
అర్ధరాత్రి దాటిన తరువాత గమనించిన తోటి విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి తెలియజేశారు. దీంతో వెంటనే వారు పావనిని కడప రిమ్స్‌కి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

అయితే పోస్టుమార్టం నిర్వహించడానికి వీల్లేదంటూ పావని కుటుంబసభ్యులు మృతదేహాన్ని తీసుకెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు మార్గమధ్యంలో వారిని అడ్డుకొని మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

పావని ఆత్మహత్య చేసుకోవడంపై తమకు అనుమానాలు ఉన్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇటీవల కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

A inter girl student allegedly committed suicide

వివాహిత అదృశ్యం

కడప రెండో పట్టణ ఠాణా పరిధిలో వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. కడప హబీబుల్లా వీధికి చెందిన రజితా బాయి (30)కు ఏడేళ్ల క్రితం అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన హరిసింగ్‌తో వివాహమైంది. వీరికి ఆరేళ్ల బాబు ఉన్నాడు.

కాగా, రజితాబాయి దసరా పండగ కోసమని పుట్టింటికి వచ్చింది. బుధవారం ఉదయం బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లింది. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదు. బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+