బలవంతంగా పెళ్ళిచేస్తున్నారంటూ కూతురు ఫిర్యాదు

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూల్: ఈ నెల 7వ, తేది నుండి కన్పించకుండా పోయిన ఇంటర్ విద్యార్థిని మంగళవారం నాడు పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైంది.అయితే తనకు తల్లిదండ్రులు బలవంతంగా పెళ్ళి చేసేందుకు ప్రయత్నించడంతో పారిపోయినట్టు చెప్పారు.

కర్నూల్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న 16 ఏళ్ళ బాలిక ఈ నెల 7వ, తేది నుండి కన్పించకుండా పోయింది. అయితే ఆమెను ఓ యువకుడు కిడ్నాప్ చేశాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

A inter student complaint against her parents in Kurnool

అయితే ఆ విద్యార్థిని మంగళవారం నాడు పోలీస్ స్టేషన్ కు వచ్చింది. తల్లిదండ్రులు తనకు బలవంతంగా పెళ్ళిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఈ మేరకు జిల్లా ఎస్పీకి ఓ వినతిపత్రం రాశారు.

తనను ఎవరూ కూడ కిడ్నాప్ చేయలేదన్నారు. పెళ్ళిచేయకుండా తల్లిదండ్రులను ఒప్పించాలని ఆమె ఎస్పీకి రాసిన వినతిపత్రంలో కోరింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలిక వినతి మేరకు తల్లిదండ్రులను పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A inter student complaint against her parents in Kurnool police station.they are trying to forcibly marry her.
Please Wait while comments are loading...