ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు, నాలుగు మాసాలకే ఆమె ఏం చేసిందంటే?

పెళ్ళైన నాలుగు మాసాలకే ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ప్రేమించి వివాహం చేసుకొని భార్యకు దూరంగా ఉండడంతో మనస్థాపానికి గురైన ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది.

విశాఖపట్టణం: ప్రేమించాడు పెళ్ళిచేసుకొన్నాడు. కట్నం ఇచ్చి మరో అమ్మాయితో వివాహం చేస్తామని తల్లిదండ్రులు ఆశచూపడంతో ప్రేమించిన అమ్మాయికి దూరంగా ఉంటున్నాడు ఆ ప్రబుద్దుడు. వివాహమైన నాలుగు మాసాలకే ఓ వివాహిత జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. భర్త మరోక యువతితో వివాహం చేసుకొంటానని చెప్పి ఆమెకు దూరంగా ఉంటున్నాడు.దీంతో ఆమె ఆత్మహత్య చేసుకొంది.

శ్రీకాకుళం జిల్లా రాజాం వస్త్రపురి కాలనీకి చెందిన జామి పద్మజను అదే కాలనీకి చెందిన ఆర్మీ ఉద్యోగి రామ్మోహన్ ప్రేమించి గత ఏడాది జూలై 20, షిరిడిలో వివాహం చేసుకొన్నాడు.

ఈ పెళ్ళి రామ్మోహన్ తల్లిదండ్రులకు ఇష్టం లేదు.అధిక కట్నం తెచ్చి మరో అమ్మాయితో వివాహం చేస్తామని రామ్మోహన్ ను ఆయన తల్లిదండ్రులు ఆశపెట్టారు.

a lady sucide after marrage four months

దీంతో పద్మజను వదిలేసి రామ్మోహన్ దూరంగా ఉంటున్నారు. దీంతో పద్మజ తన సోదరి నివాసం ఉంటున్న రాజీవ్ గృహకల్ప కాలనీకి మకాం మార్చింది.

కనుమ పండుగ రోజున రెండు కుటుంబాల మద్య పెద్ద గొడవ జరిగింది.రామ్మోహన్అక్కడే పద్మజను వదిలేసి వెళ్ళాడు.అప్పటి నుండి ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది.

దీంతో శనివారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది.సంఘటనా స్థలంలో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకొన్నారు. ఈ లేఖను పద్మజ రాసిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+