పాకిస్థాన్ జైల్లో ఉన్నది తెలుగు వ్యక్తే!: వివరాల వెల్లడి

అప్పటినుంచి తిరిగి రాకపోవడంతో మృతి చెందినట్లు భావించారు. అయితే ఆగస్టు నెలలో పాకిస్థాన్‌లోని లాహోర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న రమేష్ అనే భారతీయ యువకుడి వివరాలు తెలిస్తే చెప్పాలంటూ కేంద్ర హోంశాఖ నుంచి జంట నగరాల కమిషనర్లకు ఆదేశాలు అందాయి.
ఆ వివరాలు ఆగస్టు 28న మీడియాల్లో వచ్చాయి. మీడియాలో వచ్చిన ఫోటోను రమేశ్ సోదరుడు ఇశ్వప్ప గుర్తించాడు. ఈ మేరకు ఆయన తల్లి లక్ష్మమ్మతో కలిసి స్థానిక పోలీసులను ఆశ్రయించారు.
రమేశ్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు, ఫొటోలు తీసుకొని కుటుంబసభ్యులు శుక్రవారం ఎస్పీ కార్యాలయానికి రావాలని క్రైంబ్రాంచి డీఎస్పీ రామేశ్వర్‌రావు సూచించడంతో వాటిని అధికారులకు అందించారు. కుమారుడిని భారతదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆ ముసలి తల్లి పోలీసును వేడుకుంటోంది.












Click it and Unblock the Notifications