హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లికి నిరాకరణ: యువతికి వేధింపులు, అరెస్ట్(ఫొటో)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/రాయదుర్గం: ఆన్‌లైన్ చాటింగ్‌లో పరిచయమైన ఓ విద్యార్థిని.. పెళ్లికి నిరాకరించిందనే అక్కసుతో అసభ్య ఈ మెయిల్స్, సందేశాలు పంపిస్తూ ఆమెను వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి సెల్ ఫోన్, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

అదనపు డిసిపి జానకి షర్మిల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా కందుకూరు జనార్ధనకాలనీకి చెందిన ముచ్చెర్ల వెంకట నాగేంద్రబాబు(22) ప్రైవేటు ఉద్యోగి. బౌరంపేటలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆన్‌లైన్ చాటింగ్‌లో పరిచయమైంది. దీన్ని అలుసుగా తీసుకున్న ఆ యువకుడు తనను పెళ్లాడాలని ఆమెను కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు.

A man allegedly arrested for assaults a girl

ఇందుకు ఆమె నిరాకరించడంతో వివిధ ఫోన్ నెంబర్లను ఉపయోగించి ఆమెకు అసభ్య సంక్షిప్త సందేశాలు పంపడంతోపాటు బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అంతేగాక నకిలీ ఈ మెయిల్ ఐడీ సృష్టించి అసభ్య మెయిల్స్‌తో వేధిస్తున్నాడు.

ఫేస్‌బుక్‌లో కూడా ఆమె ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యాఖ్యలను పోస్టు చేయడంతోపాటు ఫోన్ నెంబరును పెట్టాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు జరిపిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

English summary

 A man allegedly arrested for Harassing a girl in Rayadurgam on wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X