దారుణం: ప్రియురాలిని రైలు కింద తోసేశాడు

వివరాల్లోకి వెళితే.. మాసాయిపేటకు చెందిన తస్లీమ్ (25) తన తల్లి మున్నాభితోపాటు ఆరు నెలల నుంచి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలోని ఓ పరిశ్రమలో పని చేస్తోంది. తస్లీమ మేడ్చల్‌కు చెందిన నరేష్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
ఈ క్రమంలో శనివారం హైదరాబాద్‌లో బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో తస్లీమ తల్లి మున్నాభి వెళ్లింది. తస్లీమ కూడా హైదరాబాద్ వెళ్లేందుకు శ్రీనివాస్‌నగర్ రైల్వే స్టేషన్ చేరుకోగా ప్రియుడు నరేష్ ఆమెకు కలిశాడు. వారు ఇద్దరు కొంతసేపు మాట్లాడుకున్నారు.
ఇంతలో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన నరేష్.. నిజామాబాద్ వైపు వెళ్తున్న అజంతా ఎక్స్‌ప్రెస్ కిందకు తస్లీమాను తోసేశాడు. తస్లీమ అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు నరేష్‍ను పట్టుకుని చితకబాదిన స్థానికులు, పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications