కొడుకును చంపిన తండ్రి: భర్తను హత్య చేసిన భార్య
మహబూబ్‌నగర్/ఖమ్మం: కుటుంబ కలహాల కారణంగా కన్న కొడుకునే ఓ వ్యక్తి గొంతుకోసి హత్య చేశాడు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని మెడ్జిల్ మండలంలోని జకినాలపల్లిలో ఈ దారుణం జరిగింది. గత కొంతకాలంగా ఆ కుటుంబంలో తండ్రి, కొడుకుల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో బుధవారం తండ్రి నారాయణ తన కొడుకు సైదులు గొంతుకోశాడు. గమనించిన చుట్టుపక్కల వారు సైదులును కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతను అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా మరో ఘటనలో జిల్లా కేంద్రంలోని చీడిగుట్ట ప్రాంతానికి చెందిన సునీత అనే మహిళ తన భర్త నాగభూషణంను బుధవారం తెల్లవారుజామున హత్య చేసింది. భర్త చేస్తున్న ఉద్యోగం తనకు రావాలనే ఉద్దేశంతో సునీత హత్య చేసినట్లు మృతుడి తల్లి జానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం బర్రబొందలో అడవిదుపంలు తిని ఉపాధి కూలీ మృతి చెందాడు. ఆ దుంపలు తిన్న మరో 8 మంది అనారోగ్యం పాలయ్యారు. వారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications