వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు చిన్నారుల హత్య కేసులో ట్విస్ట్: గొంతునులిమి చంపానన్న తండ్రి

|
Google Oneindia TeluguNews

A man allegedly murdered his three childrens
నల్గొండ: జిల్లాలోని వలిగొండ మండలం వెలువర్తిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలను అత్యంత దారుణంగా హత్య చేశాడు. కుటుంబకలహాలు, ఆస్తి తగాదాలతో ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలకు కరెంట్ షాకిచ్చి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. నిందితుడు రమేష్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సరిత కొంత కాలం క్రితం అతనితో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత రమేష్ మరో వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి సమయలో అతని ముగ్గురు పిల్లలు నిద్రిస్తున్న సమయంలో వారికి కరెంట్ షాకిచ్చాడు. దీంతో పిల్లలు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచారు. హత్యకు గురైన చిన్నారులు
నిరోషా(8), రక్షిత(6), యశ్వంత్.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నిందితుడు రమేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ముగ్గురు పిల్లలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. భార్య ఆస్తి కోసమే నిందితుడు ఈ హత్యలు చేసివుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ముగ్గురు పిల్లల మరణంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

చిన్నారుల హత్య కేసులో కొత్తకోణం: లొంగిపోయిన నిందితుడు

జిల్లాలో సంచలనం సృష్టించిన ముగ్గురు చిన్నారుల హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు, మృతుల తండ్రి రమేష్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు బయటపడ్డాయి. చిన్నారులను కరెంట్‌ షాక్‌తో హత్య చేయలేదని తెలిపారు. చిన్నారులను హత్య చేసుందుకు ముందుకు కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి ఇచ్చానని.. వారు చనిపోతారని భావించినప్పటికీ వారు బతికే ఉండటంతో కర్చీఫ్‌తో గొంతునులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు.

చిన్నారుల హత్య అనంతరం తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించానని అయితే అది విఫలం కావడంతో చిన్నారులు కరెంట్‌ షాక్‌ తగిలి చనిపోయినట్టు సృష్టించి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులకు వెల్లడించారు. మరోవైపు మృతి చెందిన ముగ్గురు చిన్నారులకు రామాన్‌పేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు చిన్నారులు కరెంట్‌షాక్‌తో చనిపోలేదని ప్రాథమికంగా నిర్ధారించారు.

English summary
A man allegedly murdered his three childrens in Nalgonda district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X