ఆస్తి కోసం భార్యకు నిప్పు: లాడ్జీలో యువతి దారుణ హత్య
చిత్తూరు: ఆస్తి కోసం ఓ దుర్మార్గుడు కట్టుకున్న భార్యకు నిప్పంటించి హతమార్చాడు. ఈ దారుణ ఘటన జిల్లాలోని మదనపల్లి మండలం బొమ్మనచెరువులో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
లాడ్జిలో యువతి దారుణహత్య
విజయవాడలోని రామయ్య లాడ్జిలో శుక్రవారం ఓ యువతి దారుణహత్యకు గురయింది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన నెల్లూరు వాసులు స్వాతి-శ్రీనివాస్‌లు రామయ్య లాడ్జిలో బస చేశారు. స్వాతితో పాటు వచ్చిన శ్రీనివాసే స్వాతిని గొంతు నులిమి చంపినట్లు తెలుస్తోంది. నిందితుడు శ్రీనివాస్‌ను పట్టుకుని లాడ్జి సిబ్బంది పోలీసులకు అప్పగించారు.

మహిళా లెక్చరర్ అనుమానాస్పద మృతి
విజయవాడ నగర శివారులోని గొల్లపుడిలో గల ఓ కార్పొరేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోన్న హరిత(26) కళాశాల ప్రాంగణంలో అనుమానాస్పద రీతిలో మరణించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండటం మునిపల్లికి చెందిన హరిత.. గత ఐదేళ్లుగా సదరు కళాశాల ఆవరణలోని హాస్టల్‌లో ఉంటూ విద్యార్థులకు పాఠాలు చెప్తోంది.
శుక్రవారం ఉదయం హాస్టల్ గదిలో స్పృహకోల్పోయిన ఆమెను.. ఇతర సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గత కొద్దిరోజులుగా హరిత అనారోగ్యంతో బాధపడుతోందని, ఆ కారణంతోనే చనిపోయిందని కళాశాల యాజమాన్యం పేర్కొంది.
కాగా, తమ కుమార్తె ఆరోగ్యంగానే ఉన్నదని, గత రాత్రి కూడా తమతో ఫోన్‌లో మాట్లాడిందని మృతురాలి తల్లిదండ్రు చెప్పారు. ఇంతలోనే ఎలా చనిపోతుందని మృతురాలి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications