సోదరుడితో సంబంధం పెట్టుకుందని భార్య హత్య
కృష్ణా: తన సోదరుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో కట్టుకున్న భార్యనే హత్య ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లాలోని గంపలగూడెం మండలం పెనుగొలనులో చోటు చేసుకుంది. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సంగెపు ఏసుమణి (25) హత్య కేసులో ప్రధాన నిందితుడు కృష్ణ, అతనికి సహకరించిన మృతురాలి అత్తమామలు జమలమ్మ, పేతురు, సోదరుడు రాజాను, ఏసుమణితో వివాహేతర సంబంధం కలిగిన శివను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. గంపలగూడెం పోలీసుస్టేషనులో ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ కిషోర్‌బాబు మీడియాకు తెలిపారు.

ఐస్ విక్రయించి జీవనం సాగించే సంగెపు కృష్ణ గత ఆదివారం ఉదయం 7 గంటలకు తెలంగాణ రాష్ర్టంలోని మధిర వెళ్లి ఐస్‌క్రీములు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. అదే సమయంలో భార్య ఏసుమణి, సోదరుడు శివతో కలిసి ఉండడాన్ని చూసిన ఆయన ఆవేశంలో మాంసం నరికే కత్తితో ఏసుమణి తలపై, వీపుపై బలంగా మోదాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరింది.
కాగా, శివ అక్కడ్నుంచి పరారయ్యాడు. కృష్ణ జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. వారి సహకారంతో మంచంపై పడివున్న ఏసుమణిపై కిరోసిన్ పోసి నిప్పటించి కృష్ణ బయటికి వెళ్లిపోయాడు. శివ, ఏసుమణిల మధ్య వివాహేతర సంబంధం విషయంలో కుటుంబసభ్యులు గతంలో మందలించినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో హత్యకు ఒడిగట్టినట్లు కృష్ణ పోలీసు వాంగ్మూలంలో తెలిపాడు. నిందితులను అరెస్టు చేసి తిరువూరు కోర్టులో హాజరుపర్చగా, 15 రోజుల రిమాండ్ విధించింది.












Click it and Unblock the Notifications