ఘోరం: తండ్రికి మద్యం తాగించి, పడిపోగానే బాలికపై రేప్ చేశాడు

కర్నూలు: జిల్లాలోని ఉల్లిందకొండ పోలీసుస్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చిన్నటేకూరు గ్రామంలో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు రామాంజనేయులు(37)ను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్‌పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం రామాంజనేయులు పూటుగా మద్యం సేవించి, ఆ బాలిక తండ్రికి కూడా మద్యం తాగించాడు. ఆ తర్వాత బాలిక తండ్రికి సంబంధించిన నిర్మాణంలో ఉన్న ఇంటికి వెళ్లారు.

మద్యం మత్తులో ఉన్న బాలిక తండ్రి అక్కడే పడిపోయాడు. కాగా, రామాంజనేయులు ఇంట్లోని బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పుడే అక్కడికి వచ్చిన బాలిక తల్లి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి నిందితుడ్ని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

A man allegedly raped a girl in Kurnool district

అనుమానాస్ప స్థితిలో వ్యక్తి మృతి

ధర్మవరం రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న ముళ్లపొదల్లో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి (50) మృతి చెందాడు. అటుగా వస్తున్న స్థానికులు మృతదేహాన్ని చూసి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించారు.

పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతుడు ఎవరైనేది తెలియరాలేదు. అనారోగ్యంతో మృతి చెందాడా..? ఎవరైన హత్య చేశారా.? అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+