అనుమానంతో చెల్లెలికి నిప్పంటించాడు: తల్లిదండ్రులకూ..

A Man allegedly set fire to his sister and his mother and father
నల్గొండ/రంగారెడ్డి: తన సోదరిపై అనుమానం వ్యక్తం చేసిన అన్న, ఆమెతో కుటుంబ సభ్యులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అతను కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. ఈ ధారుణ ఘటన నల్గొండ జిల్లాలోని భువనగిరిలో దారుణం చోటు చేసుకుంది. తీవ్ర గాయాలపాలైన బాధితులను ఆస్పత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళితే.. భువనగిరి పట్టణంలో కిరణ్ అనే వ్యక్తి కారు డ్రైవరుగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా తన చెల్లెలు ఎక్కువగా మాట్లాడుతుండటంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు కిరణ్, శుక్రవారం కిరణ్ ఇంటికి వచ్చిన సమయంలో కూడా ఆమె ఫోన్‌లో మాట్లాడుండటంతో ఆగ్రహానికి లోనైన కిరణ్, ఆమె చేతిలోని ఫోన్ తీసి నెలకేసి కొట్టాడు.

ఆ తర్వాత చెల్లెలితో, ఇతర కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగి ఇంట్లో ఉన్న మూడు లీటర్ల కిరోసిన్‌ను తల్లి ఇందిరమ్మ, తండ్రి లక్ష్మయ్య, చెల్లెలు కీర్తిపై పోసి నిప్పంటించాడు. అనంతరం తాను నిప్పంటించుకున్నాడు.

తీవ్రగాయాల పాలైన నలుగుర్ని స్థానికులు భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం వారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తామని పోలీసులు తెలిపారు.

భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి: జిల్లాలోని కీసర గీతాంజలి కళాశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఎంబిఏ చదువుతున్న ఆ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+