బాత్రూంలో రహస్య కెమెరాలు: ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలని మోసం
విజయవాడ: అనంతపురం జిల్లాలోని గుంతకల్లులోని ఓ కల్యాణ మండపం బాత్ రూమ్‌లో రహస్య కెమెరాలు ఉన్నట్లు కొందరు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
పిల్లలతో తల్లి ఆత్మహత్య
విజయనగరం జిల్లా పినవేమలి గ్రామంలో సోమవారం ఉదయం విషాద సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. బావిలో దూకి ఆమె ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన బంగారమ్మ (29), తన కూతురు చిట్టి (4), కుమారుడు చరణ్ తేజ (10 నెలలు)లతో కలిసి బావి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఉద్యోగాల పేరుతో మోసం

ఇదిలావుంటే ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఘరానా మోసం చేసిన ఏజెంట్ బాగోతం వెలుగు చూసింది. ఉద్యోగాలిప్పిస్తామంటూ విజయవాడలో 80 మంది నుంచి 2 నుంచి 3 లక్షల రూపాయలను వసూలు చేసిన ఏజెంట్ రవిరెడ్డి పరారయ్యాడు. దీంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధితులు ఐదురోజులపాటు ముంబయిలో ఉంచి ఏజెంట్ పరారయ్యాడు.
వివాహిత ఆత్మహత్య
వివాహమై ఆరేళ్లు కావస్తున్నా సంతానం కలగకపోవడంతో మనస్తాపానకిి గురై ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెనుగొండ మండలం ములపర్రు గ్రామంలో జరిగింది. ములపర్రుకు చెందిన కట్టా వీర్రాఘవులు, అనురాధలకు ఆరేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి సంతానం కలుగలేదు.
సంతానం కలగడానికి అవకాశాలు లేవని తెలియడంతో మనస్తాపానికి గురైంది. టెస్టు ట్యూబ్ బేబీ ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈలోలు తోడికోడలు గర్భం దాల్చింది. దీంతో ఆమె మరింత కుంగిపోయింది. దాంతో తీవ్ర మనోవేదనకు గురైన అనురాధ శనివారం రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించింది.












Click it and Unblock the Notifications