అర్ధరాత్రి ఇంటికొస్తే మరొకరితో భార్య: ఆగ్రహంతో హతమర్చాడు

విశాఖపట్నం రోలుగుంట మండలంలోని కొవ్వూరులో వివాహేతర బంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. రాత్రి ఇంటికి వచ్చిన వ్యక్తికి.. ఇంట్లో మరో వ్యక్తితో అతని భార్య ఉండటం కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె భర్త..

విశాఖపట్నం: రోలుగుంట మండలంలోని కొవ్వూరులో వివాహేతర బంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. రాత్రి ఇంటికి వచ్చిన వ్యక్తికి.. ఇంట్లో మరో వ్యక్తితో అతని భార్య ఉండటం కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె భర్త.. భార్యతో ఉన్న వ్యక్తిని దారుణంగా హతమార్చాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసుల కథనం ప్రకారం.. కొవ్వూరు గ్రామంలో ఆదివారం హనుమాన్‌ జయంతి సందర్భంగా భజనా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన అద్దేపల్లి అప్పారావు సమయం మించిపోవడంతో రాత్రి రామాలయంలోనే పడుకున్నాడు.

A man killed his wife's paramour

అయితే రాత్రి ఒంటి గంట సమయంలో నిద్ర మేల్కొని ఇంటికి వెళ్లగా, అతని భార్య కనిపించలేదు. దీంతో ఇంటిపైకి వెళ్లి చూడగా అదే గ్రామానికి చెందిన మంత్రి సత్తిబాబు(45)తో కలిసి ఉండటాన్ని గమనించాడు. దీంతో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించి సత్తిబాబును ఇటుకలతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ సత్తిబాబు అక్కడిక్కడే మృతి చెందాడు.

ఘటనపై సమాచారం తెలిసిన వెంటనే నర్సీపట్నం ఏఎస్పీ ఐశ్వర్య రస్తోగి సీఐ కోటేశ్వరరావు, ఎస్‌.ఐ రామారావుతో కలిసి సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను గ్రామాస్థులను అడిగి తెలుసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడు అప్పారావును త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+