పెళ్లికి మూహార్తం లేదని ఓయో రూంకు తీసుకెళ్లి..!

పోలీసులు ప్రేమ పేరుతో జరిగిన ఓ దారుణ మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. బట్లపల్లికి చెందిన ఓ మహిళ, విడాకుల అనంతరం తన పుట్టింటికి తిరిగి రాగా, పెద్దమామ కుమారుడు యద్దనపూడి సుధాకర్ ఆమెను పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. పెద్దలు అంగీకరించకపోయినా, సుధాకర్ ప్రేమ నాటకం కొనసాగించాడు.

పెద్దల అంగీకారంతోనే వివాహం అని నమ్మించి, హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో మంగళసూత్రం, మెట్టెలు చూపించి, గుడికి వెళ్దామని చెప్పి, "మంచి రోజు కాదు" అంటూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఒంగోలు తీసుకెళ్లి, ఏప్రిల్ 30న పెళ్లి చేస్తామని బంధువులతో చెప్పి, ఆమెను పుట్టింటికి పంపాడు.

A man who sexually assaulted a woman

అయితే, తర్వాత సుధాకర్ మాట మార్చి, పెళ్లి చేసుకునేది లేదు, నీకు దిక్కున్న చోట చెప్పుకో, ఫోన్ చేస్తే చంపేస్తా అంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. సుధాకర్‌తో పాటు అతడిని దాచిపెట్టిన తల్లిదండ్రులు, అన్న, మేనమామలపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ముండ్లమూరు ఎస్సై కమలాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ప్రేమ, విశ్వాసం పేరుతో జరుగుతున్న మోసాలకు నిదర్శనంగా నిలుస్తోంది, మహిళలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+