మేయర్ హత్య: వైసిపి నేతల ఇళ్లల్లో సోదాలు, చింటూ ఇంట్లో 4 కత్తులు
చిత్తూరు: మేయర్ అనురాధ దంపతుల హత్య కేసును పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేస్తున్నారు. అనురాధ దంపతుల హత్య కేసులో పోలీసులు గురువారం నాడు పలువురు అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
గురువారం నాడు పోలీసులు దాదాపు పదిమంది అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. చింటూ అనుచరుల ఇళ్లలోను సోదాలు నిర్వహించారు. విజయానంద రెడ్డి, శ్రీధర్, బుల్లెట్ సురేష్, ఏకాంబరం, గుర్పప్ప నాయుడు, వీరేష్, శివ తదితరుల ఇళ్లలో సోదాలు చేశారు.
ఇందులో విజయానంద రెడ్డి, శ్రీధర్‌లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అని తెలుస్తోంది. రాష్ట్ర బిసి సంఘం నేత ఇంట్లోను పోలీసులు సోదాలు నిర్వహించారు. చింటూ అలియాస్ చంద్రశేఖర్ నివాసంలో పోలీసులు సోదా చేసి.. నాలుగు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక, గుర్రప్ప.... మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ప్రధాన అనుచరుడు. బుల్లెట్ సురేశ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు. వీరి ఇళ్లలో సోదాలు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అనూరాధ దంపతుల హత్య కేసుకు సంబంధించి 11 మంది నిందితులు ఉన్నారు.
కాగా, ఈ కేసులో పోలీసులు ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశారు. దాదాపు 40 మందికి నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. చింటూ, సన్నిహితుల ఇళ్లలో పోలీసులు ఇటీవల కూడా సోదాలు నిర్వహించారు. తాజాగా మరోసారి సోదాలు చేశారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications