Baby Delivery In Train: రైలులో గర్భిణీకి పురిటినొప్పులు.. పురుడు పోసిన వైద్య విద్యార్థిని..
ఆ మధ్య విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురి కాగా అదే విమానంలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళి సై ప్రథమిక చికిత్స అందించారు. తాజాగా రైలులో ప్రయాణిస్తున్న గర్భిణీకి పురిటి నొప్పులు రాగా అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్న వైద్య విద్యార్థి ఆమెక్ ప్రసవం చేశారు. సికింద్రాబాద్- విశాఖ దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఓ గర్భిణి నొప్పులతో బాధపడుతుంటే అదే రైలులో ప్రయాణిస్తున్న వైద్య విద్యార్థిని ఆమెకు పురుడు పోశారు.
సికింద్రాబాద్ నుంచి విశాఖ పట్నం వెళ్తున్న శ్రీకాకుళానికి చెందిన గర్భిణికి సత్యవతి (28) అనకాపల్లి సమీపంలోకి రాగానే పురుటి నొప్పులొచ్చాయి. కాసేపటి తర్వాత నొప్పులు మరింత పెరగడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అదే ట్రైన్ లో గీతం మెడికల్ కాలేజీకి చెందిన హౌస్ సర్జన్ స్వాతి ప్రయాణిస్తున్నారు. సత్యవతికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో విషయం తెలుసుకున్న స్వాతి మరో మహిళతో కలిసి సుఖప్రసవం చేశారు.

అనకాపల్లి రైల్వే స్టేషన్ లో అప్పటికే సిద్ధంగా ఉన్న 108 వాహనంలో అనకాపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. తల్లిబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ధైర్యంగా ముందుకు వచ్చిన స్వాతిని పలువులు ప్రశంసించారు.ఇప్పటివరకు తోటి వైద్యులు, సిబ్బంది సాయంతోనే డెలివరీలు చేశానని, ఒంటరిగా.. ఎలాంటి పరికరాలు లేకుండా చేసిన మొదటి డెలివరీ ఇదేనని స్వాతి తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications