ఘోరం: బాలిక కిడ్నాప్, కారులో తిప్పుతూ మూడురోజులపాటు గ్యాంగ్‌రేప్

అనంతపురం జిల్లాలోని గుత్తిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కామాంధులు.. కారులో తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అనంతపురం: జిల్లాలోని గుత్తిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన కామాంధులు.. కారులో తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ మూడు రోజులపాటు ఈ అఘాయిత్యాన్ని కొనసాగించారు. దుండగుల బారి నుంచి తప్పించుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై నిందితుల నిర్భయ, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

గుత్తి ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుత్తి జంగాలకాలనీకి చెందిన 13ఏళ్ల బాలిక స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఏప్రిల్ 5న శ్రీరామనవమి పండుగ సందర్భంగా సాయంత్రం ఆరు గంటల సమయంలో రామాలయానికి వెళ్లింది. స్వామిని దర్శించుకున్న అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. కాగా, బుడగ జంగం కాలనీకి చెందిన అశోక్, యంగన్నపల్లికి చెందిన సురేష్‌లు ఆ బాలికను అడ్డుకుని, నోటిలో గుడ్డలు కుక్కి కారులో తీసుకెళ్లారు.

A minor girl allegedly gangraped in a moving car

గుడికి కెళ్లిన బాలిక పొద్దుపోయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. కాగా, ఏప్రిల్ 8న (శనివారం) తెల్లవా రుజాము 3 గంటల సమయంలో గుత్తిలోని రవితేజ హోటల్‌ వద్ద కిడ్నాపర్లు బాలికను వదిలివెళ్లారు.

అక్కడ్నుంచి ఇంటికి చేరుకున్న బాలిక.. తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో బాలికను తీసుకుని ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. తనను కిడ్నాప్‌ చేశాక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారని చెప్పింది. మూడు రోజులపాటు కారులో నిర్బంధించి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం కొనసాగించారని, తర్వాత కారులోనే తీసుకొచ్చి గుత్తిలోని రవితేజ హోటల్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయారని విలపించింది.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు అశోక్‌ పట్టణంలోని అన్నపూర్ణ హోటల్లో వంటమనిషి అని, మరో నిందితుడు సురేష్‌ ఆటోడ్రైవర్‌ అని పోలీసుల విచారణలో తేలింది. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ ఇద్దరిపై నిర్భయ కేసుతోపాటు సెక్షన్‌ 366 (కిడ్నాప్‌), 342 (నిర్బంధం), 376బీ (అత్యాచారం), 109 (అత్యా చారాన్ని ప్రోత్సహించడం), పోక్సో- నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+