దారుణం: 8ఏళ్ల చిన్నారిపై అత్యాచారం

గుంటూరు: నగరంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ 8ఏళ్ల చిన్నారిపై వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పాల కోసం సమీపంలోని దుకాణానికి వెళ్లిన 8ఏళ్ల చిన్నారిపై షాపు యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ చిన్నారికి తరచూ కడుపు నొప్పి రావడంతో విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైని బాధితురాలి కుటుంబసభ్యులు నిందితుడ్ని చితకబాదారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమత్తం ఆస్పత్రికి తరలించారు.

A minor girl allegedly raped in Guntur

రైలు కిందపడి తల్లీ కూతుళ్లు మృతి

రైలు కిందపడి నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపోడు గేటు సమీపంలో జరిగింది. మండలంలోని వైకోట గ్రామానికి చెందిన మణెమ్మ(25), అరుణమ్మ(28), పిల్లలు పావని (4), హరిత(3) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. రైలు పట్టాలపై మృతిదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.

మరో ఘటనలో కుటుంబకలహాల కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని పుంగనూరు మండల కేంద్రంలోని కోనేటిపాలెం వీధిలో చోటు చేసుకుంది. గాయత్రి(26) అనే మహిళకు, హరినాథరెడ్డితో ఏడేళ్ల క్రితం వివాహం అయింది. అప్పటి నుంచి తరచూ ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల హరి రెండో వివాహం చేసుకోవడంతో మనస్తాపం చెందిన గాయత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+