వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖ రాజధానిగా మాస్టర్‌ప్లాన్: చంద్రబాబులా గ్రాఫిక్స్ ఉండవ్: మోడీతో కాళ్లబేరాలు: సాయిరెడ్డి

|
Google Oneindia TeluguNews

అమరావతి: సాగర నగరం విశాఖపట్నాన్ని రాష్ట్ర పరిపాలనా రాజధానిగా మార్చే ప్రక్రియను మరింత వేగవంతం చేసింది ప్రభుత్వం. అక్టోబర్‌లో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ నుంచి పరిపాలన కొనసాగించడానికి అవసరమైన చర్యలను చేపట్టినట్టే కనిపిస్తోంది. కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ పరిపాలనకు బ్రేక్ వేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇష్టపడట్లేదని, ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారమే విశాఖను పరిపాలనా రాజధానిగా బదలాయించడంపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా- ఓ మాస్టర్‌ప్లాన్‌ను కూడా ప్రభుత్వం రూపొందిస్తోంది.

చంద్రబాబు మైండ్ డీజనరేట్.. గొలుసులు రెడీ: ఊహించిందే.. ఈ ఘనత దక్కకుండా: ఏది నిజం?: సాయిరెడ్డిచంద్రబాబు మైండ్ డీజనరేట్.. గొలుసులు రెడీ: ఊహించిందే.. ఈ ఘనత దక్కకుండా: ఏది నిజం?: సాయిరెడ్డి

మరో నెలరోజుల్లో ఈ మాస్టర్‌ప్లాన్ సిద్ధం అవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి తాజాగా ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. విశాఖను రాజధానిగా మార్చడానికి అవసరమైన సరికొత్త మాస్టర్‌ప్లాన్‌ను ప్రభుత్వం రూపొందిస్తోందని అన్నారు. ఇదివరకటి చంద్రబాబు హయాంలో చూపించినట్టుగా గ్రాఫిక్స్ ఉండవని అన్నారు. గ్రాఫిక్స్ రహిత మాస్టర్‌ప్లాన్ రూపుదిద్దుకుంటోందని చెప్పారు.

A new master plan is being developed to transform Vizag, says YSRCP MP Vijayasai Reddy

రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను అభివృద్ధి చేయడానికి వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని అన్నారు. చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చెప్పారు. విశాఖపట్నం.. అభివృద్ధికి కేంద్రబిందువుగా పరివర్తనం చెందడం ఖాయమని అన్నారు. గత ప్రభుత్వం అమరావతి విషయంలో చూపించినట్టుగా గ్రాఫిక్స్, కంప్యూటర్ డిజైన్లు ఉండవని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు.40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొంటూ తిరిగే చంద్రబాబు ఒక్కసారి కూడా సొంతంగా ఎన్నికల్లో గెలవలేదని ఎద్దేవా చేశారు.

English summary
YSR Congress Party senior leader and MP V Vijayasai Reddy told that A new master plan is being developed to transform Vizag. He said that Chief Minister YS Jagan Mohan Reddy is committed to developing Visakhapatnam by announcing it as the Administrative Capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X