అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కీచక పోలీస్: మహిళా అధికారికి లైంగిక వేధింపులు, సోషల్ మీడియాలో ఫొటోలు

|
Google Oneindia TeluguNews

అనంతపురం: ప్రజలకు, మహిళలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు ఉద్యోగం చేస్తూ కీచకుడిలా ప్రవర్తించాడో దుర్మార్గుడు. పోలీసు వృత్తికే మాయని మచ్చ తెచ్చిన ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కదిరిలో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న రాజేంద్ర ఓ మహిళా వ్యవసాయ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అంతేగాక, ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను రాజేంద్ర సోషల్ మీడియాలో పెట్టాడు.

ఆగ్రహించిన బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కానిస్టేబుల్ రాజేంద్రపై నిర్భయ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

A police constable arrested for sexual harassment

కోర్టుకొచ్చిన దొంగను అరెస్ట్ చేశారు

నెల్లూరు: ఓ కేసులో కోర్టుకు హాజరైన నిందితుడిని మరో నాన్‌బెయిల్‌బుల్ కేసులో మూడో నగర పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నిం చడంతో.. పోలీసులు, నిందితుడి కుటుంబసభ్యుల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు నగరంలోని కుక్కలగుంట ప్రాంతానికి చెందిన అరవ రమేష్ 2011లో ఓ చోరీ విషయలో నిందితుడు.

అప్పటి నుంచి రమేష్ పోలీసులు కళ్లుగప్పి తిరుగుతున్నారు. ఇతనిపై మూడో నగర పోలీసులు నాన్‌బెయిల్‌బుల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఒకటోనగర పోలీస్‌స్టేషన్‌లోని ఓ పెండింగ్ కేసులో అరవ రమేష్ జిల్లా కోర్టుకు హాజరయ్యాడు.
ఈ విషయం తెలుసుకున్న మూడోనగర పోలీసులు కోర్టు నుంచి పాత జిల్లా జైలు మీదుగా వచ్చే రోడ్డు బయటకు వస్తుండగా రమేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో నిందితుడు రమేష్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.

నిందితుడు పరారీ అయ్యేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలో పోలీసులు, నింది తుడు, అతని కుటుంబ సభ్యుల మధ్య తోపులాట, పెనుగులాట జరిగింది. దాదాపు అరగంటకు పైగా ఈ హైడ్రామాతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఓ దశలో ఉద్రిక్తతకు దారితీసింది. అయితే చివరికి పోలీసులు.. రమేష్‌ను బలవంతం గా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

English summary
A police constable arrested for sexual harassment in Anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X