ఆ రకంగా డొల్లతనాన్ని బయట పెట్టేసుకుంటోన్న చంద్రబాబు..!!

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రాజెక్టుల పర్యటన.. చేదు అనుభవాన్ని మిగిల్చినట్టే కనిపిస్తోంది. ఈ పర్యటనతో ఆయన వివాదాలను కొని తెచ్చుకున్నట్టయింది.. వ్రతం చెడినా ఫలితం దక్కలేనట్టుగా తయారైంది. ఈ పర్యటన ఆద్యంతం వివాదాలు, ఉద్రిక్తతలే కావడం అటు పార్టీ క్యాడర్‌ మనోస్థైర్యాన్ని కూడా దెబ్బతీసిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఈ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించిన విషయం తెలిసిందే. సందర్శన అనంతరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు చేసిన విశ్లేషణ.. ఆయనలోని డొల్లతనాన్ని బయటపెట్టిందని, ఏ మాత్రం విషయ పరిజ్ఞానం లేదనే సంకేతాలను పంపించినట్టయిందని చెబుతున్నారు.

Chandrababu

రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటన ఏ స్థాయిలో ఉద్రిక్తతలకు దారి తీసిందో.. రాష్ట్ర ప్రజలందరూ చూశారు. తొలుత కడప జిల్లా పులివెందుల ఆయన నిర్వహించిన రోడ్ షోలో ఉద్రిక్తత తలెత్తింది. దాని తరువాత అన్నమయ్య రాయచోటి జిల్లాలోని పుంగనూరులో యుద్ధ వాతావరణమే నెలకొంది.

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో తన బలాన్ని చాటుకునే ప్రయత్నం చేయడమే దీనికి కారణమైందని అంటున్నారు. పోలీసులపై టీడీపీ నాయకులు యథేచ్ఛగా దాడులు చేయడం, వాహనాల ధ్వంసానికి పాల్పడటం, వాటికి నిప్పు పెట్టడం వంటి పరిణామాలు..టీడీపీ మైలేజీని గణనీయంగా తగ్గించాయనే వాదనలు లేకపోలేదు.

పుంగనూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ సానుభూతిపరులు కూడా ఈ ఘటన పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ నాయకులు ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ దాడికి పాల్పడ్డారని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. ఇది ఆ పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టినట్టయింది.

ఇక పోలవరంలో మరో తంతు. పోలవరం ప్రాజెక్టులో సుడిగుండం ఏర్పడటం వల్లే డయాఫ్రం వాల్ ధ్వంసమైందని చంద్రబాబు విశ్లేషించిన తీరు నీటిపారుదల శాఖ నిపుణులను ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలియని విషయాల్లో వేలు పెట్టడం సరైంది కాదని వార అభిప్రాయపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందే టీడీపీ ప్రభుత్వమంటూ దానికి సంబంధించిన సాంకేతిక వివరాలను సైతం బయటపెడుతున్నారు.

Chandrababu

అప్పర్ కాఫర్ డ్యామ్ నాన్ ఓవర్ ఫ్లో డ్యామ్ గా డిజైన్ చేశారు. దీని లెవెల్ 42.5 మీటర్లు. ప్రధాన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ లెవెల్ 53.32 మీటర్లు. 45.72 మీటర్ల లెవెల్ వరకు ప్రాజెక్టులో నీరు నిల్వ చేయడానికి వీలు ఉంటుంది. దీని వల్ల రిజర్వాయర్ నీటి మట్టం 43.5 మీటర్లు దాటగానే నీరు అప్పర్ కాఫర్ డ్యామ్‌పై నుంచి ఉధృతంగా ప్రవహించే ప్రమాదం ఉందని, నదీ గర్భంలో ఇసుక కోత ఏర్పడి మెయిన్ డ్యామ్ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని వివరిస్తోన్నారు.

మెయిన్ డ్యామ్ నిర్మాణం పూర్తయిన తరువాత ప్పర్ కాఫర్ డ్యామ్‌ను తొలగించేంత వరకు పోలవరం రిజర్వాయర్ లో 39.46 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయడం సరికాదని అంచనా వేస్తోన్నారు. దీనికి భిన్నంగా చంద్రబాబు మాత్రం 45.75 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయొచ్చని చెప్పడాన్ని ఏకీభవించట్లేదు సాగునీటి పారుదల రంగానికి చెందిన నిపుణులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+