పట్టివేత: వ్యభిచార ముఠాలో జూనియర్ సినీ నటి

నగరంలో పలమనేరు రోడ్డు వద్ద 25 ఏళ్ల వయస్సు ఉన్న సినీ నటితో పాటు హైదరాబాదుకు చెందిన రాజేశ్వర రెడ్డి, బెంగళూరుకు చెందిన హనుమంత రాజును పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. సినీ నటిని పోలీసులు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. ఆ తర్వాత ఆమెను తిరుపతిలోని మహిళా హోంకు తరలించారు.
దోపిడీ దొంగల బీభత్సం
నెల్లూరు జిల్లా జలదంకి మండలం లింగరాజు అగ్రహారంలో గత అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని పలు ఇళ్లలో వరుసగా చోరీలకు పాల్పడి పరారవుతున్న దొంగలను గ్రామస్తులు వెంబడించి పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో దొంగలు గ్రామస్థులపై ఆయుధాలతో దాడి చేశారు. అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే, గ్రామస్తులు ఓ దొంగను పట్టుకోగలిగారు. మరో ముగ్గురు దొంగలు పరారయ్యారు. దొరికిన దొంగను గ్రామస్థులు గ్రామంలోకి తీసుకుని వచ్చి చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గ్రామానికి వచ్చి దొంగను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. మిగిలిన దొంగల ఆచూకీకి కోసం అతన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
అయ్యప్ప భక్తుల మృతి
జార్ఖండ్‌లో శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప భక్తులు మరణించారు. అధిక వేగంతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో గాయపడిన మరో అయ్యప్ప భక్తుడు మరణించాడు. మిగతా ఇద్దరి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు శబరిమలై వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.












Click it and Unblock the Notifications