మహిళా భక్తులపై సైకో దాడి: ముగ్గురి పరిస్థితి విషమం

A Psycho attacked on devotees at Tirupati
తిరుపతి: చిత్తూరు జిల్లాలోని తిరుపతి దేవస్థానానికి వెళ్లే నడకదారిలో శనివారం వేకువ జామున ఓ సైకో వీరంగం సృష్టించాడు. నడకదారిలో వెళుతున్న భక్తులపై కర్రలతో విచక్షణా రహితంగా దాడిచేశాడు. ఈ దాడిలో పది మంది భక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని తిరుపతిలోని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు.

మహిళలనే టార్గెట్ చేసిన సైకో వారిపై కర్రలతో విచక్షణా రహితంగా దాడికి దిగడంతో వారి కుటుంబ సభ్యులు సైకోను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారిపై కూడా సైకో దాడికి పాల్పడ్డాడు. నడకదారిలో నరసింహస్వామి ఆలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టి ఆ సైకోను అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తికి మతిస్థిమితం లేదని పోలీసులు తెలిపారు. బాధితులందరూ తమిళనాడులోని చెన్నైకి చెందిన వారని పోలీసులు చెప్పారు. మహిళలనే టార్గెట్ చేస్తూ సైకో దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనకు ముందు శుక్రవారం కూడా తిరుమల వైపు వస్తున్న వాహనాలపై రాళ్లు రువ్వుతూ అలజడి సృష్టించాడని, అయితే తాము విస్తృతంగా గాలించినప్పటికీ దొరకలేదని పోలీసులు చెప్పారు. మళ్లీ శనివారం ఉదయం కూడా మహిళలపై ఆ సైకో దాడ ికి పాల్పడ్డాడని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+