శాడిస్ట్ భర్తకు షాక్.. పోలీస్ స్టేషన్ ముందే భార్య బంధువులు ఇలా..
అతనో శాడిస్ట్ భర్త. పెళ్లయిన తొలినాళ్ల నుంచే అదనపు కట్నం కోసం వేధించేవాడు. మానసికంగా,శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాడు. పైగా వాటిని వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఇన్నాళ్లు అతని వేధింపులను భరిస్తూ వచ్చిన భార్య ఇక తనవల్ల కాదని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే క్రమంలో విచారణ నిమిత్తం పోలీసులు అతన్ని స్టేషన్‌కు పిలిపించగా.. అక్కడే అతన్ని పట్టుకుని ఆమె బంధువులు దేహశుద్ది చేశారు. కర్నూలు జిల్లా డోన్‌లో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన అరవింద్‌కు,డోన్ తారకరామనగర్‌కు చెందిన కావ్యకు గతేడాది డిసెంబర్ 7న వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే అరవింద్ తన అసలు స్వరూపం బయటపెట్టాడు. నిత్యం అదనపు కట్నం కోసం వేధిస్తూ ఆమెపై దాడి చేసేవాడు. శారీరకంగా హింసేవాడు. వాటన్నింటిని తన సెల్‌ఫోన్‌లో బంధించి బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఇన్నాళ్లు అతని వేధింపులు భరించిన ఆమె.. ఇక ఓపిక నశించి పోలీసులను ఆశ్రయించింది.

Recommended Video

ఇదే క్రమంలో పోలీసులు అతన్ని విచారించేందుకు సోమవారం స్టేషన్‌కు పిలిచారు. తీరా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చేసరికి కావ్య బంధువులు కనిపించడంతో అరవింద్ షాక్ తిన్నాడు. వెంటనే అతన్ని పట్టుకుని చితకబాదారు. తమ అమ్మాయిని చిత్రహింసలు పెట్టినందుకు దేహశుద్ది చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని శాంతింపజేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసుపై దర్యాప్తు జరుగుతోంది.












Click it and Unblock the Notifications