దారుణం: ఏడేళ్ల బాలికపై అత్యాచారం, నిందితుడి అరెస్ట్
కర్నూలు: ఏడేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఆదివారం కర్నూలు పట్టణంలోని కడగ్‌పూరా కాలనీలో వెలుగుచూసింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కడగ్‌పూరా కాలనీకి చెందిన ఖాజాబాషా భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు.
కాగా, శనివారం రాత్రి తమ ఇంటి పక్కనే ఉన్న ఏడేళ్ల పాపను ఎత్తుకెళ్లాడు. పాప ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే నిందితుడు శనివారం రాత్రి పాపపై అత్యాచారం చేసి ఆదివారం వదిలేయడంతో ఇంటికి చేరింది.

తల్లిదండ్రులు జరిగిన విషయంపై ఆరా తీసి బాషాను పట్టుకొని చితకబాదారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications