తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TTD: దేశానికి ఐకాన్ గా శ్రీవారి తిరుమలలో ఆ ప్రాజెక్ట్, లక్షల్లో తాళపత్ర గ్రంధాలు, టెక్కీల శ్రమతో !

టీటీడీ మరో అడుగు ముందుకు వేసింది. భక్తుల కోసం టీటీడీ యాజమాన్యం సరికొత్త టెక్నాలజీతో మాను స్క్రిప్ట్స్ ప్రాజెక్ట్ దేశానికే ఐకాన్ గా మార్చే ప్రయత్నాలు చేస్తోంది.

|
Google Oneindia TeluguNews

తిరుమల/తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎందురు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా శ్రీవారికి ఎలాంటి నష్టం ఉండదు. ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం (వాటికన్ సిటీ తరువాత) రెండో స్థానం సంపాధించుకున్న తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం అని అందరికి తెలిసిందే. అలాంటి టీటీడీ (TTD) మరో అడుగు ముందుకు వేసింది. భక్తుల కోసం టీటీడీ యాజమాన్యం సరికొత్త టెక్నాలజీతో మాను స్క్రిప్ట్స్ ప్రాజెక్ట్ దేశానికే ఐకాన్ గా మార్చే ప్రయత్నాలు చేస్తోంది.

TTD: తిరుమలలో గదలు ఇక ముందు ఇలాగే ఇస్తారు, నెలకు ఎన్నిసార్లు అంటే, లడ్డూలకు రూల్స్ !TTD: తిరుమలలో గదలు ఇక ముందు ఇలాగే ఇస్తారు, నెలకు ఎన్నిసార్లు అంటే, లడ్డూలకు రూల్స్ !

టీటీడీ మాను స్క్రిప్ట్స్

టీటీడీ మాను స్క్రిప్ట్స్

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మాను స్క్రిప్ట్స్ ప్రాజెక్టు దేశానికే ఐకాన్ గా తయారు కావాలని టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి అన్నారు. ఇక్కడ స్కాన్ చేసి భద్రపరచిన మాను స్క్రిప్ట్స్ పై విద్యార్థులు పీహెచ్ డీ లు చేసే స్థాయికి తీసుకుని రావాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు.

మాను స్క్రిప్ట్స్ ప్రాజెక్టు ప్రగతిపై సోమవారం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇదే సందర్బంలో ప్రాజెక్టు ప్రగతిపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

5 వేలకు పైగా తాళపత్ర గ్రంధాలు

5 వేలకు పైగా తాళపత్ర గ్రంధాలు

ఈ సందర్భంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ పురావస్తు శాఖ నుంచి తెచ్చిన సుమారు 5,500 తాళపత్ర గ్రంధాల్లో ఇప్పటివరకు 3,370 తాళపత్ర గ్రంధాలు స్కాన్ చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో 2,11,313 తాళపత్రాలు ఉన్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. రెండు నెలల్లో మిగిలిన గ్రంధాలను కూడా స్కాన్ చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారం, సిబ్బందిని ఇస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు.

తెలుగులోకి తాళపత్ర గ్రంధాలు

తెలుగులోకి తాళపత్ర గ్రంధాలు

ప్రస్తుతం రోజుకు ఎన్ని తాళపత్రాలు స్కాన్ చేస్తున్నారు, తాళపత్రం శుభ్రపరచడం నుంచి తైల శోధన, స్కానింగ్ వరకు జరిగే వివిధ ప్రక్రియల గురించి టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలుసుకున్నారు. వేదాంతం, పురాణాలు, కావ్యాలు, జ్యోతిష్యం తదితర అంశాలకు సంబంధించిన తాళపత్ర గ్రంధాలు ఉన్నాయని అధికారులు టీటీడీ ఈవో ధర్మారెడ్డి కి వివరించారు. ఇవి జాతి సంపద అని, వీటిని జాగ్రత్తగా స్కాన్ చేసి ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా తెలుగులోకి తర్జుమా చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.

దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ?

దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ?

ఇలా తెలుగులోకి తర్జుమా చేసిన వాటిని పుస్తక రూపంలో తేవడానికి ఒక ప్రాజెక్టు తయారు చేసి ప్రతిపాదనలు ఇవ్వాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పుస్తకాల ఆధారంగా పీ హెచ్ డీ చేయడానికి విద్యార్థులకు అవసరమైన వాతావరణం కల్పించి పీహెచ్ డీ లు ప్రదానం చేసే ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. దేశంలో ఇంకా ఎక్కడ మాను స్క్రిప్ట్స్ ఉన్నాయో తెలుసుకుని వాటిని సేకరించి స్కాన్ చేసి భద్రపరచ గలిగితే పరిశోధకులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు.

తాళపత్ర గ్రంధాలు సేఫ్ గా ఉండాలి

తాళపత్ర గ్రంధాలు సేఫ్ గా ఉండాలి

ప్రస్తుతం ఉన్న గ్రంధాలను అంశాల వారీగా వర్గీకరించి వాటికి ప్రత్యేకంగా నంబర్లు వేసి భద్రపరచడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. సనాతన జీవన్ ట్రస్టు సహకారంతో టీటీడీ ఆధ్వర్యంలో వేద విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ప్రాజెక్టుకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తేవాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారిణి, టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి, విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య రాణి సదాశివ మూర్తి, మానుస్క్రిప్ట్స్ ప్రాజెక్టు డిప్యూటీ ఈవో శ్రీమతి విజయలక్ష్మి, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య రాధేశ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

English summary
A special project in TTD which stands as an icon of India. says TTD EO AV Dharma Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X