ఖైరతాబాద్ గణనాథుడి లడ్డూ ప్రస్థానం (పిక్చర్స్)
హైదరాబాద్/తూర్పుగోదావరి: దేశంలో ఓ ప్రత్యేక గుర్తింపును చాటుకున్న ఖైరతాబాద్ గణనాథుడికి సమర్పించే లడ్డూ ప్రసాదం ప్రస్థానం ఒక చిన్నారి ప్రశ్నతో మొదలైంది. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునే భక్తులు తమకు లభించిన ఆ లడ్డూ ప్రసాదాన్ని మహదానందంగా స్వీకరించి తరిస్తారు. గణనాథుడి చేతిలో ఆ లడ్డూ పెట్టడం మాత్రం 2010 నుంచే ప్రారంభమైంది. అంతకుముందు గణనాథుడి చేతిలో కృత్రిమంగా తయారు చేసిన ప్రసాదం(ప్లాస్టర్ ఆప్ ప్యారిస్) ఉండేది.
2009లో తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పివివిఎస్ మల్లిఖార్జున రావు (మల్లిబాబు) తన కుటుంబ సమేతంగా ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆయన మూడేళ్ల కూతురు మనస్వి గణపతి చేతిలో మట్టి లడ్డూను చూసి ‘దేవుడికి ఎవరన్నా మట్టి లడ్డూ పెడతారా?' అని ఆయనను ప్రశ్నించింది. దీంతో గణనాథుడికి నిజమైన లడ్డూనే ప్రసాదంగా సమర్పించాలని మల్లిబాబు నిర్ణయించుకున్నారు.
వెంటనే ఆయన తన ఆలోచనను అనాటి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్, శిల్పి రాజేంద్రన్‌ను కలిసి వివరించారు. వారి అనుమతితో మరుసటి సంవత్సరం అంటే 2010లో 600 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు. అదే విధంగా 2011లో 2,400 కిలోలు, 2012లో 3,500 కిలోలు, 2013లో 4,200 కిలోల లడ్డూను మహా గణనాథుడికి ప్రసాదంగా సమర్పించారు. అదే ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు మల్లిబాబు.
ఈ ఏడాది కూడా 5,000కిలోల లడ్డూను సమర్పించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేశారు. ఖైరతాబాద్ గణనాథుడి లడ్డూ తయారు చేసేందుకు తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ ఆవరణలో ప్రత్యేక కుటీరాన్ని ఏర్పాటు చేశారు. ప్రసాదం తయారీలో పాల్గొనే సిబ్బందితోపాటు యజమాని మల్లిబాబు కూడా వినాయక మాల ధరించి ఎంతో భక్తిశ్రద్ధలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో మల్లిబాబుతోపాటు 11మంది సిబ్బంది పని చేస్తున్నారు.

లడ్డూ ప్రసాదం
దేశంలో ఓ ప్రత్యేక గుర్తింపును చాటుకున్న ఖైరతాబాద్ గణనాథుడికి సమర్పించే లడ్డూ ప్రసాదం ప్రస్థానం ఒక చిన్నారి ప్రశ్నతో మొదలైంది.

లడ్డూ ప్రసాదం
ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునే భక్తులు తమకు లభించిన ఆ లడ్డూ ప్రసాదాన్ని మహదానందంగా స్వీకరించి తరిస్తారు.

లడ్డూ ప్రసాదం
గణనాథుడి చేతిలో ఆ లడ్డూ పెట్టడం మాత్రం 2010 నుంచే ప్రారంభమైంది. అంతకుముందు గణనాథుడి చేతిలో కృత్రిమంగా తయారు చేసిన ప్రసాదం ఉండేది.

మల్లిబాబు
2009లో తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పివివిఎస్ మల్లిఖార్జున రావు (మల్లిబాబు) తన కుటుంబ సమేతంగా ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారు.

లడ్డూ ప్రసాదం
ఆ సమయంలో ఆయన మూడేళ్ల కూతురు మనస్వి గణపతి చేతిలో మట్టి లడ్డూను చూసి ‘దేవుడికి ఎవరన్నా మట్టి లడ్డూ పెడతారా?' అని ఆయనను ప్రశ్నించింది.

లడ్డూ ప్రసాదం
దీంతో గణనాథుడికి నిజమైన లడ్డూనే ప్రసాదంగా సమర్పించాలని మల్లిబాబు నిర్ణయించుకున్నారు.

లడ్డూ ప్రసాదం
వెంటనే ఆయన తన ఆలోచనను అనాటి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్, శిల్పి రాజేంద్రన్‌ను కలిసి వివరించారు. వారి అనుమతితో మరుసటి సంవత్సరం అంటే 2010లో 600 కిలోల లడ్డూను ప్రసాదంగా సమర్పించారు.

లడ్డూ ప్రసాదం
అదే విధంగా 2011లో 2,400 కిలోలు, 2012లో 3,500 కిలోలు, 2013లో 4,200 కిలోల లడ్డూను మహా గణనాథుడికి ప్రసాదంగా సమర్పించారు. అదే ఆనవాయితీని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు మల్లిబాబు.

లడ్డూ ప్రసాదం
ఈ ఏడాది కూడా 5,000కిలోల లడ్డూను సమర్పించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేశారు.

లడ్డూ ప్రసాదం
ఖైరతాబాద్ గణనాథుడి లడ్డూ తయారు చేసేందుకు తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ ఆవరణలో ప్రత్యేక కుటీరాన్ని ఏర్పాటు చేశారు.

లడ్డూ ప్రసాదం
ప్రసాదం తయారీలో పాల్గొనే సిబ్బందితోపాటు యజమాని మల్లిబాబు కూడా వినాయక మాల ధరించి ఎంతో భక్తిశ్రద్ధలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో మల్లిబాబుతోపాటు 11మంది సిబ్బంది పని చేస్తున్నారు.

లడ్డూ ప్రసాదం
ఈ సందర్భంగా సురుచి ఫుడ్స్ యజమాని మల్లిబాబు మాట్లాడుతూ.. తాను జీవించి ఉన్నంత కాలం ఖైరతాబాద్ గణనాథుడికి ప్రసాదాన్ని సమర్పించుకుంటానని తెలిపారు. ఈ మేరకు ఖైరతాబాద్ గణపతి ఉత్సవ కమిటీకి తాను మాటిచ్చానని తెలిపారు.

లడ్డూ ప్రసాదం
కొందరు తనను తెలంగాణ వినాయకుడికి ఆంధ్రా లడ్డేమిటని ప్రశ్నిస్తున్నారని చెప్పిన ఆయన.. భగవంతుడికి భక్తుడికీ మధ్య ప్రాంతీయ భేదాలు ఉండవని తెలిపారు.

లడ్డూ ప్రసాదం
ఈ సంవత్సరం మహా లడ్డూను నవరాత్రుల తర్వాత భక్తులకు పంచాలని ఉత్సవ కమిటీ తీసుకున్న నిర్ణయం తనకెంతో సంతోషాన్నిచ్చిందని పొలిశెట్టి మల్లిఖార్జున రావు తెలిపారు.

లడ్డూ ప్రసాదం
తాపేశ్వరం లడ్డూ తయారీ పనులను ఆగస్టు 24న ప్రారంభించారు. లడ్డూ తయారీ కోసం 1,450 కిలోల శెనగపప్పు, 1,000కిలోల నెయ్యి, 2,250 కిలోల పంచదార, 90 కిలోల బాదం పప్పు, 30కిలోల యాలకులు, 10 కిలోల పచ్చ కర్పూరం వినియోగిస్తున్నారు.

లడ్డూ ప్రసాదం
ఈ లడ్డూ ఐదు టన్నుల బరువు, 6.5 అడుగుల వ్యాసం, 7.5 అడుగుల ఎత్తు ఉంటుంది. తయారైన లడ్డూ ప్రసాదాన్ని ఆగస్టు 29న వినాయక చవితికి ఖైరతాబాద్ మహా గణపతికి ప్రసాదంగా సమర్పిస్తారు.
ఈ సందర్భంగా సురుచి ఫుడ్స్ యజమాని మల్లిబాబు మాట్లాడుతూ.. తాను జీవించి ఉన్నంత కాలం ఖైరతాబాద్ గణనాథుడికి ప్రసాదాన్ని సమర్పించుకుంటానని తెలిపారు. ఈ మేరకు ఖైరతాబాద్ గణపతి ఉత్సవ కమిటీకి తాను మాటిచ్చానని తెలిపారు. కొందరు తనను తెలంగాణ వినాయకుడికి ఆంధ్రా లడ్డేమిటని ప్రశ్నిస్తున్నారని చెప్పిన ఆయన.. భగవంతుడికి భక్తుడికీ మధ్య ప్రాంతీయ భేదాలు ఉండవని తెలిపారు. ఈ సంవత్సరం మహా లడ్డూను నవరాత్రుల తర్వాత భక్తులకు పంచాలని ఉత్సవ కమిటీ తీసుకున్న నిర్ణయం తనకెంతో సంతోషాన్నిచ్చిందని పొలిశెట్టి మల్లిఖార్జున రావు తెలిపారు.
తాపేశ్వరం లడ్డూ తయారీ పనులను ఆగస్టు 24న ప్రారంభించారు. లడ్డూ తయారీ కోసం 1,450 కిలోల శెనగపప్పు, 1,000కిలోల నెయ్యి, 2,250 కిలోల పంచదార, 90 కిలోల బాదం పప్పు, 30కిలోల యాలకులు, 10 కిలోల పచ్చ కర్పూరం వినియోగిస్తున్నారు. ఈ లడ్డూ ఐదు టన్నుల బరువు, 6.5 అడుగుల వ్యాసం, 7.5 అడుగుల ఎత్తు ఉంటుంది. తయారైన లడ్డూ ప్రసాదాన్ని ఆగస్టు 29న వినాయక చవితికి ఖైరతాబాద్ మహా గణపతికి ప్రసాదంగా సమర్పిస్తారు.












Click it and Unblock the Notifications