విషాదం: క్రికెట్ ఆడుతూ విద్యార్థి మృతి
పశ్చిమగోదావరి: జిల్లాలోని పేకేరులో ఆదివారం ఘటన విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కొంతమందితో కలిసి పదవ తరగతి చదువుతున్న సుబ్రహ్మణ్యం క్రికెట్ ఆడుతున్నాడు.
ఆ క్రమంలోనే బంతి కోసం పరుగుపెడుతున్న సమయంలో విద్యార్థి తుదిశ్వాస విడిచారు. అతడు పరుగెడుతున్నప్పడు గుండె కొట్టుకునే వేగం పెరిగి మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడు పెనుగొండకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇసుక ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి

గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కళ్లిపాలెం గ్రామానికి చెందిన దాసరి భిక్షాలు, ఆయన భార్య లక్ష్మీ తిరుపతమ్మ ఆదివారం ఉదయం గుడికి వెళ్లారు.
తిరిగి కళ్లిపాలెంకు వస్తుండగా.. రేపల్లె రోడ్డులో ప్రజ్నం వద్ద ఎదురుగా వచ్చిన ఇసుక ట్రాక్టర్ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మీ తిరుపతమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. భిక్షాలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు.
ఇది ఇలా ఉండగా గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం తెల్లపాడులో నివసిస్తున్న మాధవి అనే వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications