ఎల్‌కెజి విద్యార్థిని చితకబాదిన టీచర్: ఎంఈఓపై దాడి
హైదరాబాద్/కడప: నగరంలోని కూకట్‌పల్లిలోని వికాస్ భారతి స్కూల్‌లో దారుణం జరిగింది. అల్లరి చేశాడని ఓ ఎల్‌కెజి విద్యార్థిని టీచర్ చితకబాదింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన నిర్వహించారు.
కాగా, టీచర్ తాను చేసిన పనిని సమర్థించుకుంది. పిల్లలు అల్లరి చేస్తే కొట్టే అధికారం తమకు ఉందని వాదించింది.

బాలికల పట్ల అసభ్య ప్రవర్తన: ఎంఈఓపై దాడి
కడప: ఇద్దరు ఉపాధ్యాయులు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ కడప జిల్లా రాజంపేట మండలంలో బోయనపల్లి పాఠశాల వద్ద విద్యార్థులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కాగా, గ్రామస్తులకు సర్దిచెప్పడానికి వచ్చిన ఎంఈఓపై విద్యార్థులు, గ్రామస్తులు దాడి చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
గుంటూరు వినుకొండలో దారుణం
గుంటూరు జిల్లాలోని వినుకొండలో దారుణం జరిగింది. నర్సుల ఆపరేషన్ చేయడంతో ఓ నిండు గర్భిణీ మృతి చెందింది. గర్భిణి మరణవార్త విని తట్టుకోలేక బాధితురాలి తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు.












Click it and Unblock the Notifications