ప్రేమ: వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య
కృష్ణా: జిల్లాలోని యనమలకుదురులో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను గత కొన్ని రోజులుగా ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అతని వేధింపులు భరించలేకనే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
కాగా, ప్రేమోన్మాది రేణుకారావు వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మృతురాలు తన సూసైడ్ నోట్‌లో పేర్కొంది. యువతి రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రేమోన్మాది కోసం గాలింపు ప్రారంభించారు.
చెట్టును ఢీకొన్న కారు: దంపతుల మృతి
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఏడిబి రహదారిలో గురువారం ఉదయం రోడ్డు పక్కన ఉన్న చెట్టును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గున్నంపల్లి నాగేశ్వర్, అతని భార్య నీలవేణి అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న కుమారుడు సాయికుమార్‌కు స్పల్ప గాయాలయ్యాయి.

బాధితులందరూ కాకినాడకు చెందినవారిగా గుర్తించారు. ప్రస్తుతం సాయికుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగేశ్వరరావు కుటుంబం రంగంపేటలో ఓ శుభకార్యానికి హాజరై కాకినాడ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు: ఒకరి మృతి
ప్రకాశం జిల్లా చీరాల దండుబాట రోడ్డులో ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఏకాంబరం అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం రాత్రి 11గంటల సమయంలో కారంచేడు నుంచి చీరాలవైపు వస్తున్న కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది.
ప్రమాదానికి గురైన వాహనం గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ వాహనంలా గుర్తించారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications