వివాహేతర సంబంధం: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చింది
అనంతపురం: జిల్లాలోని పుట్టపర్తి మండలం పెడబల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తుచేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన మంజులాబాయికి అదే గ్రామానికి చెందిన యుగంధర్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. కరవు పరిస్థితులతో ఉపాధి కోసం ఐదేళ్ల క్రితం బెంగుళూరు వలసవెళ్లారు. అక్కడ తాపీ పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
ఈ క్రమంలో మంజులాబాయి అదే గ్రామానికి అంజినాయక్‌తో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. విషయం తెలుసుకున్న భర్త పలుమార్లు బంధువులు, పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు కనిపించలేదు. అంతేగాక, తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది.

అనుకున్న ప్రకారం ఆగస్టు 11న రాత్రి ప్రియుడు అంజినాయక్‌తో కలిసి నిద్రిస్తున్న యుగంధర్‌నాయక్‌ను హతమార్చారు. మృతదేహాన్ని సంచిలోపెట్టి ముళ్లపొదల్లో పడేశారు. నిందితురాలు ఏమీ ఎరుగనట్లు తన భర్త కనిపించటం లేదని ప్రచారం చేసింది. ఇదే విషయాన్ని స్వగ్రామంలోని ఆమె మామకు తెలిపింది.
మామ స్థానికుల సాయంతో బెంగళూరులో ఆరా తీయటంతో తన కొడుకు హత్యకు గురైనట్లు తెలుసుకున్నాడు. ప్రియుడు పెడబల్లిలో ఉన్నట్లు గుర్తించిన గ్రామస్థులు నిందితుడిని చెట్టుకు కట్టేసి కర్ణాటక పోలీసులకు అప్పగించారు. దీంతో తండ్రిని కోల్పోయి, తల్లి జైలుకు వెళ్లటంతో పిల్లలు అనాధలయ్యారు.












Click it and Unblock the Notifications