పట్టపగలే రేప్‌కు యత్నం: ప్రతిఘటనతో గొంతుకోశారు

రక్తపు మడుగులో ఉన్న బాధితురాలిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికులు చేరుకునే లోపే నిందితులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పలు ఆధారాలు సేకరించారు. దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితులు దాస్, హనుమంతులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తాగిన మైకంలోని ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ కూడా బాధితురాలి భర్త వద్ద కూలీలుగా పనిచేస్తున్నవారేనని పోలీసులు చెప్పారు.
ఆర్థిక ఇబ్బందులు: భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
పశ్చిమగోదావరి: జిల్లాలోని తణుకులోని ఓ ప్రైవేటు లాడ్జీలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణంగానే వీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. బాధితులు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని కాతేరు ప్రాంతానికి చెందిన గడిగంటి కృష్ణ, కళ్యాణిగా గుర్తించారు.
సమాచారం అందుకున్న బాధితుల బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే భర్త కృష్ణ మృతి చెందగా.. భార్య కళ్యాణి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications