భర్త వివాహేతర సంబంధం: పిల్లలకు ఉరివేసి మహిళ ఆత్మహత్య
అనంతపురం: గుత్తి పట్టణంలోని చెట్నేపల్లికాలనీలో దారుణం చోటు చేసుకుంది. భర్త వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండటంతో భరించలేని ఓ భార్య తన ఇద్దరు పిల్లలతోపాటు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. చెట్నేపల్లి కాలనీకి చెందిన రఘుబాబు వడ్డీ వ్యాపారి. ఇతనికి 2008లో నేత్రావతి (28)తో వివాహమైంది. వీరికి మురారి (6), ముకేష్ (4) కుమారులు ఉన్నారు. కొంతకాలంగా రఘుబాబు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

ఈ విషయం తెలిసిన భార్య నేత్రావతి తరుచూ భర్తతో గొడవపడేది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కూడా ఆమె భర్తతో గొడవ పడింది. మనస్తాపం చెందిన నేత్రావతి.. రఘుబాబు ఇంటి నుంచి వెళ్లిపోగానే తలుపులు వేసి కొడుకులను ఫ్యానుకు ఉరివేసింది.
అనంతరం ఆమె కూడా ఫ్యానుకు ఉరివేసుకుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రఘుబాబు.. ముగ్గురూ ఫ్యాన్‌కు వేలాడుతుండడం చూసి పోలీసులకు సమాచారం అందజేశాడు. వెంటనే పోలీసులు వచ్చి తల్లీకొడుకులను గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications