నిద్రిస్తున్న మహిళపై కిరోసిన్ పోసి నిప్పంటించారు
కర్నూలు: జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లెలో మంగళవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు నిద్రిస్తున్న ఓ మహిళను తాళ్లతో కట్టి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యారు.
గమనించిన చుట్టుపక్కల వారు మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
బ్యాంకు మేనేజర్ ఇంట్లో చోరీ

విశాఖపట్నం: మద్దిలపాలెం ప్రాంతంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. డాక్టర్ విఎస్ కృష్ణా కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న ఆంధ్రాబ్యాంకు జనరల్ ఇన్స్యూరెన్స్ మేనేజర్ అనిల్ కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు. బీరువాలో ఉన్న 18 తులాల బంగారం, 3.5 కిలోల వెండి వస్తువులు, రూ. 90వేల నగదును అపహరించారు. బాధితుడు ఎంవిపి కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనకాపల్లికి వెళ్లిన అనిల్ కుమార్ జనవరి 1న తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తాళం బద్దలుకొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. దీంతో తమ ఇంట్లో చరీ జరిగినట్లు గుర్తించారు అనిల్. వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications