పెళ్లి పేరుతో మాజీ ఎమ్మెల్యే కూతుర్ని లోబర్చుకున్న ఏసీపీ: డీజీపీకి ఫిర్యాదు
హైదరాబాద్: ప్రజల రక్షణ కల్పించాల్సిన విభాగంలో ఉన్నతాధికారిగా పని చేస్తూ కీచకుడిలా ప్రవర్తించాడొ ప్రబుద్ధుడు. ఓ దళిత యువతికి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. వివాహం చేసుకుంటానని చెప్పి శరీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత మోహం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. నిందితుడికి ఓ మంత్రి అండదండలున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. పాయకరావుపేట నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే కాకర్ల నూకరాజు కుమార్తె పద్మలత మార్చి19న డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన మధురవాడ ఏసీపీ దాసరి రవిబాబు నుంచి రక్షణ కల్పించాలని కోరారు. అయితే డీజీపీ సానుకూలంగా స్పందిస్తూ శాంతిభద్రతల అదనపు డీజీకి ఈ అంశాన్ని అప్పగించారు.
అదనపు డీజీ వినతిపత్రాన్ని పరిశీలించడమే కాకుండా పద్మలత వాదనలో వాస్తవం ఉందని గ్రహించి ఆ వినతిపత్రంపైనే విశాఖపట్నం పోలీసు కమిషనర్‌కు ఎండార్స్ చేసి ఏసీపీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా, అక్కడి మంత్రి ఒకరు జోక్యం చేసుకుని ఏసీపీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సూచించడంతో విశాఖపట్నం పోలీసు కమిషనర్ మిన్నకుండిపోయారనే ఆరోపణలున్నాయి. దీంతో పద్మలత ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
కాగా, బాధితురాలి వినతిపత్రంలోని అంశాలు ఇలా ఉన్నాయి.. గతంలో ఎంపీపీగా పనిచేసిన సమయంలో కొన్ని రాజకీయ గొడవల కారణంగా యలమంచిలి సీఐగా ఉన్న రవిబాబును కలవాల్సి వచ్చిందని పద్మలత తెలిపారు. ఆ సమయంలో యలమంచిలి కోర్టు దగ్గరున్న గెస్ట్ హౌజ్‌కు తనను పిలిపించుకుని కేసుల పేరుతో భయపెట్టి శారీరకంగా రవిబాబు లోబర్చుకున్నారని, అప్పటి నుంచి రవిబాబుతో సాన్నిహిత్యం పెరిగిందని వివరించారు.

తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పి భర్తకు విడాకులు ఇప్పించారని తెలిపారు. అనంతరం భార్యగా స్వీకరించకుండా సాకులు చెబుతూ వచ్చారని.. ఆ తర్వాత అప్పట్లో ఎంపీగా ఉన్న, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న పప్పల చలపతిరావు సమక్షంలో రవిబాబు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించారని చెప్పారు.
అప్పటి విశాఖజిల్లా డీఐజీ జితేంద్ర, రూరల్ ఎస్పీ మురళికి కూడా ఈ విషయాలన్నీ తెలుసని చెప్పారు. ఇప్పుడు రవిబాబు ఏసీపీ కావడంతో కొందరు పెద్దలను అడ్డంపెట్టుకుని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారని బాధితురాలు తెలిపారు.
'నేను ఇప్పుడు ఏసీపీని.. ఏమి చేసుకుంటావో చేసుకో.. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు' అంటూ గొంతు నొక్కుతున్నాడని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై దర్యాప్తు చేసి ఏసీపీ రవిబాబు చేత భార్యగా స్వీకరింప చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే బిడ్డకు తండ్రిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రాణహాని లేకుండా రక్షణ కల్పించాలని విన్నవించారు.
శాంతి భద్రతల అదనపు డీజీ ఆమెకు ధైర్యం చెప్పడమే కాకుండా విశాఖ కమిషర్ మాట్లాడాల్సిందిగా ఫోన్ నెంబర్ కూడా పద్మలతకు ఇచ్చారు. దీంతో పద్మలత కమిషనర్‌కు ఫోన్ చేయగా రక్షణ కల్పించే విషయంపై ప్రస్తావించకుండా 'మీరు ఎక్కడున్నారంటూ' ఆరాలు తీయడం మొదలుపెట్టారు. దీంతో ప్రాణభయం ఉందని భావించిన ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని బాధితురాలు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
-
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications