Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో మహిళతో అఫైర్: నడిరోడ్డులో భర్తను చితకబాదిన భార్య

నల్లగొండ: మరో మహిళతో వైవాహికేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య చితకబాదింది. బంధువులతో కలిసి నడిరోడ్డుపై కట్టుకున్న మొగడికి దేహశుద్ధి చేసింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో జరిగింది. శ్రీనివాస్ బాబు, అరుణ పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఐదేళ్లుగా సాఫీగానే సాగిన వీరి కాపురం ఆ తర్వాత కలహాల కాపురంగా మారింది. దీంతో ఆరేళ్ల నుంచి భార్యాభర్తలిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే శ్రీనివాస్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా భార్యను తరుచూ వేధింపులకు గురిచేశాడు. దీంతో విసిగిపోయిన భార్య భర్త ఇంటికి వెళ్లింది. వేరే మహిళతో అతను కలిసి ఉండడం చూసి భగ్గుమంది. అతన్ని బయటకు ఈడ్చి కొట్టింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు.

A woman attacked her husband for illicit affair with another lady

కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి

విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా పట్టణంలోని ఈదులగూడ క్రాసింగ్‌ వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... టిప్పర్‌ను సర్వీసింగ్‌ చేయించేందుకు కొత్తగూడెం గ్రామంనుంచి సమీపంలో గల మిర్యాలగూడలోని ఈదులగూడ క్రాస్‌రోడ్డు వద్ద గల మెకానిక్‌ షెడ్డుకు టిప్పర్‌ను తీసుకొచ్చారు. రిపేర్‌ చేసిన అనంతరం స్టార్ట్‌ చేసేందుకు టిప్పర్‌ డ్రైవర్‌ యత్నించగా మెరాయించింది.

దీంతో డ్రైవర్‌ టిప్పర్‌ నెట్టేందుకు లారీ డ్రైవర్‌ ఖాసీం(35), షేడ్డు ఓనర్‌ యలమందేశ్వర్‌రావు(50)లతోపాటు టిప్పర్‌ యజమాని అశోక్‌, కట్టా వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు నెట్టుతుండగా, ఈలోగా టిప్పర్‌కు సమీపంలో ఉన్న విద్యుత్‌ తీగలకు తగలడంతో విద్యుత్‌ సరఫరా జరిగి, ఖాసీం అక్కడికక్కడే మృతిచెందగా, యలమందేశ్వరరావు తీవ్రంగా గాయపడి.. ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు. గాయపడిన మరో ముగ్గురిలో ఇద్దరు పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలిసింది. వన్‌టౌన్‌ సీఐ భిక్షపతి కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+