ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూతురి మరణంతో ఆగిన తల్లి గుండె: కృష్ణా ఘటనపై మోడీ దిగ్భ్రాంతి

కృష్ణానది పవిత్ర సంగమం వద్ద పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల బంధువుల కన్నీటిగాథలు అందర్నీ కదిలించివేస్తున్నాయి. కాగా, ఈ ఘటన తన కన్నబిడ్డను కోల్పోయిన ఓ వృద్ధురాలి గుండె ఆగిపోయింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Boat capsizes in Vijayawada : బోటు ప్రమాదంలో తప్పు ప్రయాణికులదే !

ప్రకాశం: కృష్ణానది పవిత్ర సంగమం వద్ద పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల బంధువుల కన్నీటిగాథలు అందర్నీ కదిలించివేస్తున్నాయి. కాగా, ఈ ఘటన తన కన్నబిడ్డను కోల్పోయిన ఓ వృద్ధురాలి గుండె ఆగిపోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 లీలావతి మృతి

లీలావతి మృతి

కృష్ణా నదిలో చోటు చేసుకున్న పడవ ప్రమాదంలో మృతిచెందింది దేవాబత్తునలి లీలావతి. ఆమె మృతదేహాన్ని సోమవారం ఉదయం ఒంగోలు తీసుకొచ్చారు. కాగా, లీలావతికి భర్త లేకపోవడంతో తల్లి లక్ష్మీకాంతం వద్దే ఉంటోంది. లీలావతికి ఓ కుమార్తె ఉన్నారు. వీరు మంగమూరు రోడ్‌లో నివాసముంటున్నారు.

 విహారానికి వెళ్లి విగత జీవిగా..

విహారానికి వెళ్లి విగత జీవిగా..

కార్తీక మాసం కావడంతో వాకర్స్‌ క్లబ్‌ సభ్యులతో పాటు విహారానికి వెళ్లిన ఆమె విగతజీవిగా తిరిగొచ్చారు. పడవ ప్రమాదం విషయం తెలిసినప్పటి నుంచీ లక్ష్మీకాంతం ఆందోళన చెందారు.

ఓరే పదండ్రా! అధికారుల కన్నా మత్స్యకారులే నయం: ప్రత్యక్షసాక్షుల మాటిదిఓరే పదండ్రా! అధికారుల కన్నా మత్స్యకారులే నయం: ప్రత్యక్షసాక్షుల మాటిది

 కుమార్తె మరణం తట్టుకోలేక

కుమార్తె మరణం తట్టుకోలేక

కుమార్తె మరణవార్త తెలిసి తల్లి లక్ష్మీకాంతం కన్నీరుమున్నీరుగా విలపించారు. సోమవారం ఉదయం మృతదేహం ఇంటికి చేరుకోవడంతో లక్ష్మీకాంతం తీవ్రంగా రోదిస్తూ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. దీంతో ఆ కుటుంబంలో మరింత విషాదం నెలకొంది. కాగా, లీలావతి కుమార్తె విజయవాడలో చదువుకుంటోంది. లీలావతి, లక్ష్మీకాంతం మృతితో ఆ అమ్మాయి అనాథ‌గా మారింది.

మోడీ దిగ్భ్రాంతి..

కృష్ణా నదిలో బోటు బోల్తా పడి 17మంది మృతి చెందిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను బాధించిందని, ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయని ఆయన ట్వీట్‌ చేశారు.

English summary
A old woman died, in Ongole, after seeing her daughter's dead body, who is killed in krishna river boat accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X