అత్యాచారం, మహిళ హత్య: బంగారు నగల దోపిడీ
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సమీపంలోని రాజేంద్రనగర్ బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు ఓ మహిళపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను చంపేశారు. ఇంట్లో ఉన్న బంగారం ఆభరణాలను అపహరించుకుపోయారు. లారీ పార్కింగ్ సమీపంలో తన కూతురుతో కలిసి రమ అనే మహిళ నివసిస్తోంది.
అయితే, శనివారం ఉదయం కూతురు తల్లిని లేపడానికి కూతురు తీవ్రంగా ప్రయత్నించింది. అయినా ఫలితం కనిపించలేదు. దీంతో కూతురు ఏడ్వడం ప్రారంభించింది. దాంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు కర్ణాటకవాసి. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

గోనెసంచీలో మృతదేహం
ఇదిలావుంటే, మెదక్ జిల్లాలోని పుల్కల్ మండలం తోటాపూర్ సమీపంలో హైవేపై గోనె సంచిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లెలో సంజీవ్ అనే యువకుడిని హత్య చేసిన దుండుగులు మృతదేహాన్ని గోనె సంచిలో కట్టిపడేసినట్లు తెలుస్తోంది. పాతకక్షలే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications