భర్తను వదిలేసి అష్టకష్టాలు: ఆమెను కిడ్నాప్ చేసి, ఆటో డ్రైవర్ల గ్యాంగ్‌రేప్

భర్తను వదిలేసి అష్టకష్టాలు పడుతున్న ఓ మహిళను కిడ్నాప్ చేసిన ముగ్గురు ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు తీవ్ర రక్తస్రావం అవుతున్నా..

తూర్పుగోదావరి: భర్తను వదిలేసి అష్టకష్టాలు పడుతున్న ఓ మహిళను కిడ్నాప్ చేసిన ముగ్గురు ఆటో డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు తీవ్ర రక్తస్రావం అవుతున్నా.. పట్టించుకోకుండా నడిరోడ్డుపై వదిలేసి పరారయ్యారు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ వ్యక్తి ఆమెను అంబులెన్సులో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది.

భర్తను వదిలేసి..

భర్తను వదిలేసి..

స్థానికులు, ఆస్పత్రి ఉన్నతాధికారులు తెలిపిన వివరాలిలా ప్రకారం.. 23ఏళ్ల వయస్సున్న బాధితురాలిది తుని మండలానికి చెందినవారు. జులై 3న భర్తతో గొడవపడి అక్కణ్నుంచి బయల్దేరి స్నేహితుల ఇళ్లలో ఉంటూ చివరకు మూడు రోజుల క్రితం కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్సుకు చేరింది. చేతిలో రూపాయి లేకపోవడంతో ఆకలిని భరిస్తూ బస్‌ కాంప్లెక్సులోనే ఉంటోంది. అప్పటికే ఆమె బాగా నీరసించిపోయింది.

కిడ్నాప్ చేసి..

కిడ్నాప్ చేసి..

ఇది గమనించిన ఓ ఆటో డ్రైవరు మరో ఇద్దరి సాయంతో మంగళవారం రాత్రి ఆమెను కాంప్లెక్సు ఎదురుగా ఉన్న బ్రిడ్జి కిందికి తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు తీవ్ర రక్తస్రావం అవుతున్నా పట్టించుకోకుండా.. ఆర్టీసీ కాంప్లెక్సుకు కొద్ది దూరంలో వదిలేసి పరారయ్యారు.

ఆమె వివరాలు చెప్పేందుకు ఇష్టపడలేదు..

ఆమె వివరాలు చెప్పేందుకు ఇష్టపడలేదు..

అపస్మారక స్థితిలో ఉన్న ఆమెకు స్థానికులు నీళ్లు తాగించారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. అయితే, పోలీసులకు ఫిర్యాదు చేయాలని వైద్యులు చెప్పినప్పటికీ.. ఆమె అంగీకరించలేదు. ఆమె వివరాలు తెలిపేందుకు ఇష్టపడలేదు.

చికిత్స అందుతుండగానే..

చికిత్స అందుతుండగానే..

నిందితుల పేర్లు తనకు తెలియవని, వ్యక్తులను మాత్రం గుర్తుపట్టగలనని వైద్యులకు తెలిపింది. ప్రాథమిక వైద్యం తీసుకున్న ఆమె.. చికిత్స మధ్యలోనే అక్కడ్నుంచి వెళ్లిపోయింది. కాగా, ఈ దారుణానికి పాల్పడిన నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+