గదిలో మరో మహిళతో భర్త: తట్టుకోలేని భార్య ఏం చేసిందంటే..?
భర్త ఎన్ని వేధింపులకు గురిచేసినా ఆమె భరించింది. కానీ, మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న విషయం తెలిసి.. తీవ్ర ఆగ్రహానికి గురైంది. తన భర్త దుర్మార్గాన్ని పదిమందికి తెలియజేయాలనుకుంది.
విశాఖపట్నం: భర్త ఎన్ని వేధింపులకు గురిచేసినా ఆమె భరించింది. కానీ, మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న విషయం తెలిసి.. తీవ్ర ఆగ్రహానికి గురైంది. తన భర్త దుర్మార్గాన్ని పదిమందికి తెలియజేయాలనుకుంది. దీంతో భర్త తన ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న సమయంలో గది బయట గడియపెట్టి భర్త గుట్టును రట్టు చేసింది.

భర్త ప్రవర్తనలో మార్పు..
వివరాల్లోకి వెళితే.. గాజువాకలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్‌కు 2014లో దుర్గతో వివాహం జరిగింది. అప్పటి నుంచి వీరు ఆరిలోవలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ పాప పుట్టి చనిపోయింది. కాగా, కొద్ది కాలంగా భర్త ప్రసాద్ ప్రవర్తనలో మార్పు రావడాన్ని దుర్గ గమనించింది.

మరో మహిళతో..
ఇంటికి సరిగా రాకపోవడం, ప్రతి విషయానికి గొడవపటం చేసేవాడు. దీంతో ప్రసాద్‌పై దుర్గకు అనుమానం వచ్చింది. ఈ క్రమంలో తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని విషయం తెలుసుకుంది దుర్గ.

ప్రియురాలితో ఆరు నెలలుగా..
అంతేగాక, పురుషోత్తపురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ప్రియురాలితో ఆరు నెలలుగా కాపురం కూడా చేస్తున్నాడనే విషయం దుర్గకు తెలిసింది. దీంతో భర్త గుట్టును రట్టు చేయాలని దుర్గ భావించింది.

న్యాయం చేయండంటూ..
ఈ క్రమంలో పురుషోత్తపురం వెళ్లిన దుర్గ.. సదరు మహిళతో తన భర్త ఉండటాన్ని చూసి బయటి నుంచి తాళం వేసింది దుర్గ. పదిమందిని పిలిచి ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది.












Click it and Unblock the Notifications