నవవధువు అనుమానాస్పద మృతి: భయంతోనన్న భర్త

హైదరాబాద్: వివాహమైన 42 రోజులకే ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన నగరంలోని ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులకు మృతురాలి బంధువులు చెప్పిన కథనం ప్రకారం.. నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లికి చెందిన నందింపల్లి వెంకటేశ్వర్ రావు కుమార్తె లక్ష్మీ ప్రసన్న(21)ను అదే జిల్లా తిప్పర్తి మండలం ఇంగ్లూరుకు చెందిన ఆవుల శంకర్‌కు ఇచ్చి మే నెలలో వివాహం జరిపించారు.

నవ దంపతులు హైదరాబాద్ రాంనగర్ రామాలయం సమీపంలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. శంకర్ మింట్ కాంపౌండ్‌లోని విద్యుత్ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిన కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. లక్ష్మీ ప్రసన్న ఇంట్లోనే ఉంటోంది. ఈ దంపతులు ఉంటున్న ఇంట్లో అంతకుముందు ఒకరు ఆత్మహత్య చేసుకుని మృతి చెందారని వారికి తెలిసింది. దీంతో కొన్ని రోజులుగా లక్ష్మీప్రసన్న, శంకర్ ఆందోళకు గురవుతున్నారు.

A woman suspiciously died in hyderabad

ఇద్దరూ కలిసి బర్కత్‌పురలోని లక్ష్మీప్రసన్న అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత రాంనగర్ రామాలయం సమీపంలోని మరో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆదివారం ఇద్దరూ కలిసి ఆ ఇంటిని శుభ్రం చేసుకున్నారు. భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారుజామున 4.45 గంటల సమయంలో లక్ష్మీప్రసన్న అపస్మారక స్థితికి చేరడాన్ని గమనించిన శంకర్ ఆ విషయాన్ని మేనమామలు భీమన్న, వెంకన్నలకు చెప్పాడు.

వెంటనే లక్ష్మీప్రసన్నను విద్యానగర్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు లక్ష్మీప్రసన్న మృతి చెందినట్లు ధృవీకరించారు. అక్కడి చేరుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధవులు తీవ్రంగా రోదించారు. తమకు మృతిపై అనుమాలున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, భయం కారణంగానే తన భార్య లక్ష్మీ ప్రసన్న మృతి చెందిందని ఆమె భర్త శంకర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+