జగన్ సొంత జిల్లాలో దారుణం, ఇంటర్ అమ్మాయిపై పెట్రోల్ పోసి !!
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం కలకలం రేపింది. బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థినిని రోడ్డు పక్కన ఉండే చెట్లలోకి లాక్కెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. విగ్నేష్ అనే యువకుడు ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది.
తీవ్ర గాయాలైన విద్యార్థినిని కడప రిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన బద్వేల్ గ్రామీణ పోలీసులు నిందితుడు విగ్నేష్ ను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బద్వేల్ చేరుకున్నారు. నిందితుడు విగ్నేష్ కి, ఇంటర్ విద్యార్థినికి ఏమిటి సంబంధం, వాళ్లు అక్కడికి ఎందుకు వెళ్లారు. విఘ్నేష్ కు పెట్రోల్ ఎవరు ఇచ్చారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

బద్వేలు సమీపంలోని సెంచురీ ప్లైవుడ్ సమీపంలో ఈ సంఘటన జరగడంతో బద్వేల్ లో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ చీఫ్ వైయస్ జగన్ సొంత జిల్లాలో ఇంటర్ చదువుతున్న అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం కలకలం లేపుతోంది. ఈ విషయంపై పోలీసు అధికారులు కూడా చాలా సీరియస్ అయ్యారు.
కడప సిటీ టీడీపీ అధ్యక్షుడు శివకొండారెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. కడప సిటీ టీడీపీ సీనియర్ నాయకుడు శివకొండారెడ్డిపై కొందరు వ్యక్తులు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు. తీవ్రగాయాలైన శివకొండారెడ్డిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కడప సిటీలో అధికార పార్టీకి చెందిన నాయకుడిపై నడి రోడ్డులో దాడి చేయడం కలకలం రేపింది. శివకొండారెడ్డిపై దాడి చేసిన నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. శివికొండారెడ్డి కోలుకున్న తర్వాత ఆయన నుండి వివరాలు తెలుసుకొని నిందితులను పట్టుకుంటామని కడప పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications