ప్రేమే కారణమా?: కళాశాల విద్యార్థినిపై సుత్తితో దాడి చేసిన యువకుడు, తీవ్ర గాయాలు
గుంటూరు: నగరంలోని నాజ్ సెంటర్‌లో గురువారం ఉదయం ఓ విద్యార్థినిపై గుర్తుతెలియని యువకుడు దాడికి పాల్పడ్డాడు. కళాశాలకు వెళ్తున్న విద్యార్థినిపై సుత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. కాగా, యువకుడి దాడికి ప్రేమ వ్యవహారమే కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం... తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన విద్యార్థిని వెంకటరమణ(20)కు తల్లిదండ్రులు లేరు. ఆమె తన బంధువుల సహాయంతో మహిళా ప్రాంగణంలో ఉంటూ గుంటూరులోని మహిళా కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
కాగా, గురువారం ఉదయం కళాశాలకు చేరుకోగా... సైకిళ్లు నిలుపుదల చేసే ప్రదేశంలో ఓ యువకుడు తనతో పాటు తీసుకొచ్చిన సుత్తితో ఆమెపై దాడి చేసి ఉడాయించాడు. దాడికి పాల్పడిన యువకుడు విద్యార్థిని వెంకటరమణకు పరిచయం ఉన్న వ్యక్తిగా భావిస్తున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కళాశాల ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని గుంటూరులోని సమగ్ర ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన గురువారం ఉదయం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని రైల్వే గేటు వద్ద చోటుచేసుకుంది. మందలపాడు కాలనీకి చెందిన లక్ష్మీనారాయణ(38) ఆర్‌ఎంపీ వైద్యుడుగా పనిచేసేవాడు. గత నాలుగేళ్లుగా మద్యానికి బానిసైన లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications