బస్సులో యువతిపై బ్లేడుతో దాడి: తీవ్ర గాయాలు

కలహాలు: భార్యను హత్య చేసిన భర్త
రంగారెడ్డి: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత తానే హత్య చేశానంటూ పోలీస్ స్టేషన్‌లో పోయాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిమామిడి అనుబంధ గ్రామం దావూద్‌గూడ తాండాలో చోటు చేసుకుంది.
దావూద్‌గూడ తాండాకు చెందిన రమేష్(45) భార్య దేవి(28)తో ఆదివారం రాత్రి తమ ఇంట్లోనే గొడవ పడ్డారు. గొడవ కారణంగా ఆగ్రహానికి గురైన రమేష్ తన భార్య దేవిని తీవ్రంగా కొట్టి చంపాడు.
ఆ తర్వాత తన భార్యను హత్య చేశానంటూ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు రమేష్ ఇంటికి, అతని బైక్‌కు నిప్పంటించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications