ప్రేమ పెళ్లి చేసుకుని.. యువతికి నరకం చూపించాడు(పిక్చర్స్)
చిత్తూరు: ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. మాయమాటలతో యువతిని లోబర్చుకుని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను చిత్రహింసలకు గురిచేస్తూ నరకం చూపించాడు ఓ దుర్మార్గుడు. అతడి దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలంలో చోటు చేసుకుంది.
వివరాలిలా ఉన్నాయి.. రామచంద్రపురం మండలం రాయలచెరువుపేటకు చెందిన మునికుమార్(22) డిగ్రీ వరకు చదవి ఇంటివద్దే ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన ధనపాల్ కుమార్తె సూర్యకుమారి(16) పాఠశాలలో విద్యనభ్యసిస్తోంది. కాగా, ప్రేమిస్తున్నానంటూ రెండేళ్లుగా సూర్యకుమారి వెంటపడ్డాడు మునికుమార్. 10వ చదువుతున్న సూర్యకుమారి.. మునికుమార్ మాయమాటలు నమ్మి అతడితో ప్రేమలో పడింది.

బాధితురాలు
ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. మాయమాటలతో యువతిని లోబర్చుకుని వివాహం చేసుకున్నాడు.

బాధితురాలు
ఆ తర్వాత ఆమెను చిత్రహింసలకు గురిచేస్తూ నరకం చూపించాడు ఓ దుర్మార్గుడు.

బాధితురాలు
అతడి దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

బాధితురాలు
ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలంలో చోటు చేసుకుంది.
కొంతకాలంగా వీరిద్దరూ కలిసి తిరుగుతున్నారు. పెద్దలు వీరిని మందలించడంతో తాము విషం తాగి చచ్చిపోతామని బెదిరింపులకు గురి చేశారు. దీంతో వారు కూడా ఏమి అనలేకపోయారు. 3 నెలల క్రితం రంగంపేట వద్ద స్నేహితుల సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు. 2నెలల క్రితం సూర్యకుమారిని కాపురానికి పంపారు ఆమె తల్లిదండ్రులు.
కొద్ది రోజులపాటు వారి సంసారం సజావుగానే సాగింది. అయితే ఏమైందో ఏమోగానీ మార్చి 14వ తేదీన మునికుమార్ తన ఇంటి దగ్గర అమ్మ, నాన్న లేని సమయంలో తలుపు గడియపెట్టి సూర్యకుమారి నోట్లో గుడ్డలు కుక్కాడు. ఆ తర్వాత ఆమె శరీరమంతా గాట్లు పడేలా కొరిచాడు. తలపై కర్రతో, డిష్ వైర్‌తో తీవ్రంగా కొట్టాడు. కొంత శబ్ధం రావడంతో పొరుగింటి వారు వచ్చి సూర్యకుమారిని కాపాడారు.
కాగా, అత్తామామలు సూర్యకుమారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలిని పరామర్శించిన డిఎస్పీ నంజుండప్ప, న్యాయం చేస్తామని చెప్పారు. కాగా, పలువురు మహిళా సంఘాల నేతలు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications