ఆస్ట్రేలియాలో పశ్చిమగోదావరి విద్యార్థి అదృశ్యం: స్నేహితుల ఫిర్యాదు
సిడ్నీ/పశ్చిమగోదావరి: ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాలోని బ్రిజ్బేన్‌కు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన విద్యార్థి దుగ్గిన గోపాలకృష్ణ (23) అదృశ్యమయ్యాడు. రెండ్రోజులుగా గోపాలకృష్ణ కనిపించడం లేదంటూ బ్రిజ్బేన్‌లో ఉంటున్న అతని స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
బ్రిజ్బేన్ పోలీసులకు ఫిర్యాదు చేశామని, కేసు దర్యాప్తు చేపట్టారని వారు తెలిపారు. గోపాలకృష్ణ 2014 అక్టోబర్‌లో ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. ఇటీవల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపాలకృష్ణ ప్రాణ స్నేహితుడొకరు దుర్మరణం చెందాడు.

కాగా, ఆ విషయం తెలిసినప్పటి నుంచి గోపాలకృష్ణ డిప్రెషన్‌లో ఉంటున్నాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి గోపాలకృష్ణ చాలాసేపు ఫోన్ మాట్లాడుతూ ఉండిపోయాడని, శనివారం వేకువజామున చూడగా, అతడు కనిపించలేదని చెప్పారు.
గోపాలకృష్ణ కోసం సమీపంలోని అన్నిచోట్లూ గాలించినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని అతని స్నేహితులు తెలిపారు. తమ కుమారుడు అదృశ్యమైన విషయం తెలియడంతో గోపాలకృష్ణ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications