ఎబిఎన్ ఆంధ్రజ్యోతి సంచలనం: నీతూ అగర్వాల్ రూ. 20 వేలు అడిగారట!
హైదరాబాద్: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన సినీ నటి నీతూ అగర్వాల్‌పై సంచలన వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. వెబ్ పత్రికలో కూడా ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఇంటర్వ్యూ ఇవ్వడానికి నీతూ అగర్వాల్ 20వేల రూపాయలు ఇవ్వాలని ఆమె మేనేజర్ అడిగినట్లు ఆరోపించింది.
ఆమెతో ఇంటర్వ్యూ కావాలంటే రూ.20 వేలు చెల్లించవలసిందేనని ఆమె మేనేజర్‌గా చెప్పుకున్న వ్యక్తి డిమాండ్ చేశారని ఆ మీడియా రాసింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ వివాదంలో నీతూ పాత్ర గురించి రకరకాల ఆరోపణలు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆమె తమ వైఖరిని వివరించడానికి వీలుగా ఆమెతో ఇంటర్వ్యూ కోసం తాము ప్రయత్నించినట్లు ఏబిన్ ఆంధ్రజ్యోతి చానల్ తెలిపింది.

అయితే నీతూ మేనేజర్ డబ్బు ఏర్పాటు చేసుకున్నాక చెప్పండి ఇంటర్వ్యూ ఏర్పాటు చేస్తామని చెప్పాడని రాసింది.నీతూతో ఇతర చానళ్లలోనూ ఇంటర్వ్యూలు వచ్చాయి కదా అని ఏబిఎన్ ప్రతినిధి నీతూ మేనేజర్‌తో ప్రస్తావిస్తూ వారు కూడా డబ్బులు ఇచ్చారా అని ప్రశ్నించగా ఇచ్చారని చెప్పినట్లు రాసింది.
ఆంధ్రజ్యోతి మీడియా కథనం ఇలా సాగింది - మరి మేము ఎంతివ్వాలి అని అడిగితే మేనేజర్ రూ. 20 వేలు అని చెప్పాడు. అంత ఇచ్చుకోలేం, ఐదో, పదో వేలు ఇస్తామంటే కుదరదని ఆ మేనేజర్ చెప్పారు. టివి చానళ్లలో ఇంటర్వ్యూకోసం సినిమా నటి తరపున ఒక మేనేజర్ డబ్బు డిమాండ్ చేయడం విస్మయం కలిగిస్తోందని ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వ్యాఖ్యానించింది. ఈ సంభాషణ మొత్తాన్ని గురువారంనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేయడంతో సినిమా ప్రపంచంలో సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications