హతుడు శివపై 400 దాకా కేసులు: సివి ఆనంద్
హైదరాబాద్: శంషాబాద్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నిందితుడు కడలూరు శివపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 300 నుంచి 400 కేసులు ఉన్నాయని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. శనివారం ఎన్‌కౌంటర్ ఘటనా స్థలిని ఆనంద్ పరిశీలించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
నెల్లూరు జిల్లాకు చెందిన శివ మోస్ట్‌వాంటెడ్ క్రిమనల్ అని, సీఐపై దాడికి యత్నించి హతమయ్యాడని చెప్పారు. విజయవాడ, విశాఖ, తిరుపతిలో శివ చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. గత రెండు రోజుల్లో నార్సింగి, శంషాబాద్‌లో శివ చోరీలు చేశాడని సీపీ ఆనంద్ తెలిపారు.

శివ బెయిల్‌పై విడుదలై 27 నెలలు అయినట్లు ఆయన వెల్లడించారు. చోరీలో చేయడంలో శివ సిద్ధహస్తుడన్నారు. నార్సింగి సమీపంలో శివ నివాసాన్ని గుర్తించినట్లు చెప్పారు. శివ అనుచరులు జగదీష్, సాంబలతో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నామన్నారు.
శివ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మరో క్రిమినల్ ఎల్లంగౌడ్‌ను ఆనంద్ హెచ్చరించారు. శివను ఎన్‌కౌంటర్ చేసిన సీఐ, ఎస్ఐని సీపీ ఆనంద్ ప్రశంసించారు. గత అర్థరాత్రి తనిఖీల సందర్భంగా శివ అనే నేరస్థుడు పోలీసు కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications