Exit poll ABP C-Voter: లోక్‌సభలో వైసీపీ జీరో..?!
దేశవ్యాప్తంగా చివరి విడత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెలువడటం ఆరంభమైంది. సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. ఏపీలో జరిగిన 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ, తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల అవుతున్నాయి.
జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలకు ఇంచుమించుగా సరిపోయేలా ఇవి ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. తాజాగా ఏపీపై తన ఎగ్జిట్ పోల్ అంచనాలను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది ఏబీపీ సీ- ఓటర్. ఎవరు అధికారంలోకి వస్తారనేది తేల్చి చెప్పింది.

ఈ సర్వే నివేదికల ప్రకారం చూసుకుంటే- ఏపీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురడం ఖాయంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీకి 97 నుంచి 108 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయి. 49.73 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయి. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి 67 నుంచి 78 అసెంబ్లీ స్థానాలు దక్కుతాయి.
లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రం వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ తప్పకపోవచ్చు. మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో వైసీపీకి ఒక్కటీ దక్కకపోవచ్చని ఏబీపీ సీ- ఓటర్ సర్వే అంచనా వేసింది. 0 నుంచి 4 సీట్లు మాత్రమే లభిస్తాయని తెలిపింది. లోక్‌సభలో టీడీపీ కూటమి ప్రభంజనం కనిపిస్తుందని పేర్కొంది. 21 నుంచి 25 సీట్లు ఖాయమని అంచనా వేసింది.
ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు? ఎవరు బంటు.. అనేది తేలుతుందారోజున.












Click it and Unblock the Notifications